హైదరాబాద్ పోలీసులు సూపర్...!

Gullapally Rajesh
హైదరాబాద్ పరిధిలో దొంగతనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఒక భారీ దొంగతనం కు సంబంధించి హైదరాబాద్ కమీషనర్ అంజనీ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఇటీవలే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేజీల బంగారం అబరణలు బ్యాగు చోరీ గురైన కేసు నమోదు అయింది అన్నారు. బంగారం తో వున్న బ్యాగు మిస్ అయిందని sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">శ్రవణ్ కుమార్ గెహ్లాట్ తొలుత సైఫాబాద్ పిఎస్ లో ఈ నెల 26న ఫిర్యాదు చేశారు అని తెలిపారు. కానీ చోరీ గురైన బ్యాగు ఘటన పంజాగుట్ట లిమిట్స్ లో జరిగింది అన్నారు.
దీంతో  సైఫాబాద్ పోలీసులు  జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి పంజాగుట్ట పిఎస్ కు బదిలీ చేశారు అని ఆయన వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని నాలుగు బృందాలుగా విడిపోయి పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు అన్నారు.  శ్రవణ్ గేహ్లాట్ అనే బంగారు నగల వ్యాపారి వద్ద పనిచేసే గులాబ్ మాలి & ముకేష్ పరిహార ఈ బంగారు ఆభరణాల బ్యాగు చోరీ చేశారు అని శ్రవణ్ గెహ్లాత్ అనే నగల వ్యాపారి ఆగస్ట్ 23న పుణెలో వున్న  గులాబ్ మాలి కీ బ్యాగు అప్పగించాడు అని ఆయన తెలిపారు.
నగల బ్యాగు ను ముంబాయి లో వున్న  ముకేష్ పరిహార కి అందజేయమని వీరంతా నగరానికి చేరుకున్నారు అన్నారు. కానీ అంతలోనే  శ్రవణ్ గేహ్లాట్ వద్ద పనిచేసే గులాబ్ మాలి & ముకేష్ పరిహార  బ్యాగుతో ఇద్దరు నిందితులు పారిపోయారని అన్నారు. ఇద్దరు నిందితుల నుండి దాదాపు కోటి రూపాయల విలువ చేసే 2122.130 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నగరంలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించి అనంతరం ముంబయి లో కూడా సీసీ కెమెరాలు పరిశీలించారు అని అన్నారు. గదిచిన కొద్ది రోజులుగా కొనసాగుతున్న విచారణలో నగల వ్యాపారి తో ప్రయాణం చేసిన తోటి సిబ్బంది ఇద్దరు ఈ  బ్యాగు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు అని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: