ఊహించని పరిణామం.. ఆఫ్ఘనిస్తాన్ లో విమానం హైజాక్?

praveen
ఆఫ్ఘనిస్థాన్ లో ప్రస్తుతం అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఆయుధాలతో ఆదిపత్యాన్ని సాధించిన తాలిబన్లు ప్రస్తుతం ప్రజలందరినీ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక ఆఫ్ఘనిస్తాన్ ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ క్షణంలో ప్రాణం పోతుందో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి  అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు అరాచకాలు సృష్టిస్తూ ఉండడంతో ఇక ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆఫ్ఘనిస్థాన్ లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను తమ తమ దేశాలకు  రప్పించేందుకు చర్యలు చేపడుతున్నాయి.

 వివిధ దేశాల ప్రత్యేక విమానాలను పంపించి  విమానాల లో తమ దేశపు పౌరులను స్వదేశానికి రప్పించుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే అటు తాలిబన్లు కూడా విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగిస్తూ ఉండటం గమనార్హం. ఇటీవల ఏకంగా తాలిబన్లు ఒక విమానాన్ని హైజాక్ చేయడం సంచలనంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఇరుక్కుపోయిన ఉక్రెయిన్ పౌరులందరికీ వెనక్కి తీసుకు వచ్చేందుకు ఇక అక్కడి ప్రభుత్వం విమానం పంపగా.. దానిని హైజాక్ చేశారు. ఇక కాబుల్ ఎయిర్పోర్ట్ మీదుగా ఈ విమానాన్ని ఇరాన్ తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు.

 ఇది కాస్త ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం గా మారింది. గత ఆదివారం మా దేశం పౌరులను రప్పించేందుకు పంపించిన విమానం హైజాక్ చేశారు. ఇక విమానాన్ని ఇరాన్ తీసుకెళ్లారు. అందులో ఉన్న ప్రయాణికులు కూడా తమ దేశానికి సంబంధించిన వారు కాదు. తమ దేశ పౌరులను కాకుండా ఇతర ప్రయాణికులను  ఇరాన్ తీసుకెళ్లిపోయారు ఉక్రెయిన్  విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు.  హైజాక్ చేసిన వారి దగ్గర ఎన్నో మారణాయుధాలు కూడా ఉన్నాయి అన్న విషయాలను ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ లో విమానం హైజాక్ కావడం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: