టీడీపీ వైపు చూస్తోన్న వైసీపీ నేత ?

VAMSI
రాజకీయ పార్టీలలో ఎప్పుడూ సీనియర్లకు సముచిత స్థానం మరియు తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిన్నమొన్నటి వరకు ఏపీలోని అన్ని పార్టీలలో ఇలాంటి పద్ధతే కొనసాగుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం రాజకీయాలలో యువకుల శాతం ఎక్కువయింది. ఉడుకు రక్తంతో ఆలోచన లేకుండా ఆవేశంగా ప్రవర్తిస్తున్నారు. దీనితో సొంత పార్టీలలోనే విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. అవి కాస్తా చిలికి చిలికి గాలి వానలా మారి పార్టీని వీడే అంత పరిస్థితికి దారి తీస్తోంది. ఇలాంటి సమయంలో పార్టీ అధ్యక్షుడిగా వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇద్దరికీ నచ్చజెప్పి పార్టీలో కొనసాగేలా చెయ్యాలి. కానీ ఇలా చేయడంలో వీరు విఫలమవుతున్నారు. అందుకే పార్టీలోని సీనియర్లు పార్టీని వీడుతున్నారు. 

కొద్ది రోజుల క్రితం టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈయనకు ఎవ్వరితోనూ విభేదాలు లేవు. కానీ కేవలం ఒక సీనియర్ నాయకుడికి పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడం వల్లనే పార్టీని వీడనున్నారని ఆయనే చెప్పారు. ఈ విషయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబు ఏమీ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇదే బాటలో వైసీపీ నాయకుడు రామసుబ్బారెడ్డి నడవనున్నట్లు తెలుస్తుంది. స్థానిక వైసీపీ నాయకుడు సుధీర్ రెడ్డితో ఉన్న విభేదాలు కారణమని తెలుస్తోంది. టిడిపి నుండి జంప్ అయిన రామసుబ్బారెడ్డి కడప జిల్లా జమ్మలమడుగులో చక్రం తిప్పిన వ్యక్తి.

మాములుగా ఒక రాజకీయం నాయకుడు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి మారాడంటే ఏదో ఒకటి ఆశించే వస్తాడు. అలాంటివేవీ వైసీపీలో దక్కడం లేదని తెలిసి తన ఆలోచనని మార్చుకున్నట్టున్నాడు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే సీటు సుధీర్ రెడ్డికే నని తేల్చి చెప్పడంతో ఇక ఉండి లాభం లేదనుకుని టీడీపీ వైపే వెళుతున్నట్లు సమాచారం. పార్టీ మారినా అక్కడ ఏమాత్రం గుర్తింపు రాకపోగా, అవమానాలు ఎదురవుతుండడంతో మళ్లీ సొంత గూటికి వెళ్లే ఆలోచనలో ఉన్నారట. మరి ఈ విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: