ఇండియన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన బ్రిటన్.. ఏంటో తెలుసా?

praveen
మొన్నటి మనదేశంలో కరోనా వైరస్ సెకండ్ ప్రభావం ఎంతలా అల్లకల్లోల పరిస్థితుల సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  చూస్తూ చూస్తుండగానే వేలల్లో ఉన్న కేసులు లక్షల్లోకి చేరిపోయాయి. ఈ క్రమంలోనే ఒకానొక దశలో ఏకంగా ప్రతి రోజూ నాలుగు లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో భారత్లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి  అదే సమయంలో దేశంలో ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా వేాధించింది. దీంతో ఎంతో మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే భారత్ తో పోల్చి చూస్తే ఒకప్పుడు వైరస్ ప్రభావం ఎక్కువగా ఎదుర్కొన్నా బ్రిటన్, అమెరికా  లాంటి దేశాల్లో సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తక్కువగానే ఉంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఓ వైపు భారత్ లో భారీగా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్రిటన్ లాంటి దేశాల్లో భారత్ పై కొన్ని ఆంక్షలు విధించింది. ఏకంగా కొన్ని రోజుల పాటు భారత్ నుంచి బ్రిటన్ వెళ్లే అన్ని రకాల విమానాలపై నిషేధాన్ని విధిస్తూ బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  తమ దేశ పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయ్య లేము అంటూ దీనిపై వివరణ కూడా ఇచ్చింది బ్రిటన్ ప్రభుత్వం. అయితే ఇటీవలి కాలంలో భారత్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో..  అటు బ్రిటన్ ప్రభుత్వం కూడా భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులు విమానాలపై ఆంక్షలు కూడా కొనసాగిస్తూ వచ్చింది.  భారత్ నుంచి బ్రిటన్ వచ్చేవాళ్ళు పదిరోజులపాటు క్వారంటైన్ లో ఉండాల్సిందే అంటూ నిబంధన మొన్నటి వరకు కొనసాగింది.

 ఇక ప్రస్తుతం భారత్లో ఎక్కువ మొత్తంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోవడంతో ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  భారత ప్రయాణికులు అందరికీ శుభ వార్త చెప్పింది.  ఇండియా నుంచి బ్రిటన్ వచ్చే ప్రయాణీకులు ఇక నుంచి పది రోజులు హోటల్లో క్వారంటైన్  లో ఉండాల్సిన అవసరం లేదు అంటూ స్పష్టం చేసింది బ్రిటన్ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆంక్షల సడలింపు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈనెల 8వ తేదీ నుంచి ఈ సడలింపులు అమలులోకి వస్తాయి అంటూ బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. అయితే బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన సడలింపు కారణంగా విద్యార్థులకు ఉద్యోగులకు ఎంతగానో ఊరట కలిగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: