ఆ టీడీపీ వారసులకు సెకండ్ ఛాన్స్ కూడా కష్టమేనా!

M N Amaleswara rao
వారసత్వ రాజకీయాల్లో ఏపీ ముందువరుసలో ఉంటుందనే చెప్పొచ్చు. రాష్ట్రంలో ప్రతి నాయకుడు, తమ వారసుడుని రాజకీయాల్లోకి తీసుకురావాలనే చూస్తారు. అలాగే వైఎస్సార్ వారసుడుగా వచ్చిన జగన్ ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. అటు చంద్రబాబు వారసుడు నారా లోకేష్ సైతం రాజకీయాల్లో దూకుడుగా ఉన్నారు. ఇలా ఏపీలో చాలామంది నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో పలువురు వారసులు ఎన్నికల బరిలో కూడా దిగారు.
టీడీపీకి చెందిన సీనియర్ నేతల వారసులు తొలిసారి ఎన్నికల బరిలో దిగి జగన్ వేవ్‌లో ఘోరంగా ఓడిపోయారు. అయితే అలా ఓటమి పాలైన నాయకులు ఇప్పుడు సెకండ్ ఛాన్స్ కోసం చూస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పనిచేస్తున్నారు. అలా సెకండ్ ఛాన్స్ కోసం చూస్తున్న వారిలో గౌతు శ్యామ్ సుందర్ శివాజీ వారసురాలు గౌతు శిరీష ఒకరు. గత ఎన్నికల్లో ఈమె తొలిసారి పలాస నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అలాగే మాజీ మంత్రి మృణాలిని వారసుడు కిమిడి నాగార్జున గత ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్స సత్యనారాయణపై ఓడిపోయారు. ఇటు వస్తే తూర్పు గోదావరిలో దివంగత నేత జి‌ఎం‌సి బాలయోగి తనయుడు హరీష్ అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కృష్ణా జిల్లాలో దివంగత కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్ పెడన నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు.
చిత్తూరులో gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలో, అనంతపురంలో దివంగత పరిటాల రవి వారసుడు  రాప్తాడులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తొలిసారి బరిలో దిగి ఈ రాజకీయ వారసులు ఘోరంగా ఓడిపోయారు. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని అనుకుంటున్నారు. అయితే వీరు సెకండ్ ఛాన్స్‌లో సక్సెస్ అవుతారా? అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇప్పటికీ వైసీపీ స్ట్రాంగ్‌గా ఉంది. టీడీపీ వారసులు ఉన్న నియోజవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గానే ఉన్నారు. పైగా పథకాలు ప్లస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ వారసులకు సెకండ్ ఛాన్స్ కూడా కాస్త కష్టమే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: