దేశంలోనే తొలి స్మార్ట్ కరెంటు పోల్.. ఫీచర్లు తెలిస్తే అవాక్కవుతారు..!

Suma Kallamadi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌ను టెక్నాలజీ పరంగా ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో ఉంచాలని తపన పడుతున్నారు. ఆయన తపనే గుజరాత్‌ను అత్యంత అధునాతనమైనదిగా తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం ఆ నగరంలో ఉన్న టెక్నాలజీని చేస్తే మిగతా ప్రాంత ప్రజలందరూ అవాక్కు అవ్వాల్సిందే. గ్యాస్ పైప్ లైన్స్, ఎలక్ట్రిక్ పోల్స్, సెక్యూరిటీ కెమెరాలు, గార్బేజ్ కలెక్షన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకంటే గుజరాత్ బాగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర పాలకులుఅ ధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తూ పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధించేలా పక్క ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వ్యవసాయంతో పాటు ఇతర రంగాల్లో కూడా అద్భుతమైన టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్ రైల్వే స్టేషన్‌ సమీపంలో విలాసవంతమైన 5 స్టార్ హోటల్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
అయితే గుజరాత్ అభివృద్ధిలో భాగంగా మరొక కొత్త టెక్నాలజీని పరిచయం చేయడానికి అక్కడి పాలకులు సిద్ధమయ్యారు. ఇటీవల అహ్మదాబాద్‌లో ఓ కరెంటు స్తంభం ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక ప్రజలు అందరూ కూడా ఆ స్తంభం చూసి ఆశ్చర్య పోతున్నారు. ఎందుకంటే అది సాదాసీదా స్తంభం కాదు. అది ప్రజలందరికీ ఎంతగానో ఉపయోగపడే ఓ స్మార్ట్ పవర్ పోల్. నిజానికి ఇలాంటి కరెంటు స్తంభం దేశంలో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ప్రధాని మోదీ అహ్మదాబాద్ ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు అహ్మదాబాద్ అభివృద్ధిలో ఒక అడుగు ముందుకేసింది. ప్రస్తుతం అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరమంతా స్మార్ట్ పవర్ పోల్స్ ఏర్పాటు చేయడానికి నడుం కట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే సీజీ రోడ్డులో ఒక స్మార్ట్ పవర్ పోల్ ఏర్పాటు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి కరెంటు స్తంభాలు నగరం మొత్తంలో 19 ఏర్పాటుచేశారని తెలుస్తోంది.
ఐతే చైనా దేశస్తులు తయారు చేసిన ఈ స్తంభం ధర ఒక్కొక్కటి అక్షరాలా రెండు కోట్ల రూపాయలట. రెండు కోట్ల రూపాయలు అంటే.. ఆ మొత్తంతో సాధారణ కరెంటు స్తంభాలు ఎన్ని కొనుగోలు చేయొచ్చో ఊహించుకోండి. 19 స్తంభాలకు గాను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.38 కోట్లు చైనా దేశానికి చెల్లించింది. కళ్ళు చెదిరే ధరలతో వస్తున్న ఈ స్మార్ట్ పవర్ పోల్స్ లో సీసీటీవీలు, ఎనౌన్స్‌మెంట్, డిస్‌ప్లే వంటి ఫీచర్స్ ఉంటాయి. చైనీస్ స్మార్ట్ పోల్ ఫీచర్లు గురించి కింద వివరంగా తెలుసుకుందాం.
సాధారణంగా ఈ స్తంభాలలో 2 రకాలు ఉంటాయి. మొదటిది 1 మీటర్ స్మార్ట్ పోల్ కాగా.. రెండవది 10 మీటర్ల స్మార్ట్ పోల్. 1 మీటర్ స్మార్ట్ పోల్ ఫీచర్ల గురించి తెలుసుకుంటే.. వీటిలో వైఫై రూటర్ ఉంటుంది. 30 వాట్స్ LED ఫిక్చర్ ఉంటుంది. PTZ అనే ఒక అడ్వాన్స్డ్ కెమెరా ఉంటుంది. ఎనౌన్స్‌మెంట్ కోసం 30 W PA స్పీకర్ ఉంటుంది. అంతేకాకుండా, USB చార్జింగ్ పోర్ట్ ఉంటుంది. కరెంట్ తో నడిచే కార్ కి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఈ స్మార్ట్ పోల్ ద్వారా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా స్థానిక వాతావరణ స్థితిగతులను తెలుసుకోవడానికి ఒక వాతావరణ సూచన డివైస్ ఉంటుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే.. బిల్ బోర్డు డిస్‌ప్లే, ఎమర్జెన్సీ పుష్ బటన్ లాంటి ఫీచర్స్ కూడా ఈ పోల్ లో ఉంటాయి. 10 మీటర్ల స్మార్ట్ పోల్ లో కూడా దాదాపు ఇలాంటి ఫీచర్సే ఉంటాయి. ఐతే స్తంభాలను ఏర్పాటు చేసినప్పటికీ.. ఇప్పటికిప్పుడు వాడుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ స్మార్ట్ పోల్స్ లో సేవ్ అయ్యే డిజిటల్ డేటా చైనా కంపెనీల సర్వర్లలో స్టోర్ అవుతుందట. అయితే స్మార్ట్ స్తంభాలలో సేవ్ అయ్యే డేటా అహ్మదాబాద్ లోని సర్వర్లలో స్టోర్ అయ్యేలా సెట్టింగ్స్ చేంజ్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఈ స్మార్ట్ పోల్స్ ని వాడటం ప్రారంభిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: