య‌న‌మ‌ల నోటికి ప్లాస్ట‌ర్ వెన‌క ఇంత క‌థ ఉందా ?

VUYYURU SUBHASH
ఏపీలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రభావం క్రమక్రమంగా తగ్గుతూ ఉన్నట్టే కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ... అధికార పక్షం లో ఉన్నప్పుడు కూడా యనమల ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌కు కౌంటర్లు ఇచ్చేవారు. అయితే ఇటీవల పరిణామాలను గమనిస్తే ఆయ‌న‌ పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. చినబాబు లోకేష్ తూర్పుగోదావరి జిల్లాలో యనమలను పక్కన పెడుతూ మాజీ హోం మంత్రి చినరాజప్ప కు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. మ‌రో వైపు యనమల తన సొంత నియోజకవర్గమైన తుని లోనూ పట్టు కోల్పోతూ ఉండడంతోపాటు వరుసగా మూడుసార్లు ( య‌న‌మ‌న ఓ సారి, ఆయ‌న సోద‌రుడు కృష్ణుడు రెండు సార్లు ) ఓడిపోతున్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు పార్టీలోని సీనియర్లు సైతం యనమలను పక్కన పెట్టేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటి కి య‌నమల మాట టిడిపిలో ఎంత మాత్రం చెల్లుబాటు కాదని అంటున్నారు. ఇక ఇప్పుడు పీఏసీ చైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్ ఏపీ ఆర్థిక ప‌రిస్థితిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. న‌ల‌భై వేల కోట్ల లెక్క‌లు ఏమైపోయాయ‌ని ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇంత జ‌రుగుతున్నా గ‌తంలో ఆర్థిక మంత్రిగా ఉన్న య‌న‌మ‌ల మాత్రం కిమ్మ‌న‌డం లేదు. దీని వెన‌క టీడీపీ వ‌ర్గాల్లోనే ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

య‌న‌మ‌ల మాట్లాడితే ఏపీలో ఎవ్వ‌రూ న‌మ్మ‌ర‌ని చంద్ర‌బాబు.. టీడీపీలో కొంద‌రు కీల‌క నేత‌లు డిసైడ్ అయిపోయార‌ట‌. అందుకే వాళ్లంతా య‌న‌మ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసి ప‌య్యావుల‌తోనే మాట్లాడిస్తున్నార‌ని చెవులు కొరుక్కుంటున్నారు. వాస్త‌వంగా ప‌య్యావుల పీఏసీ చైర్మ‌న్ అయిన‌ప్ప‌ట‌కి. . గ‌తంలో ఆర్థిక మంత్రిగా ఉన్న య‌న‌మ‌ల‌కు ఇలాంటి వ్య‌వ‌హారాలు కొట్టిన పిండి. అయితే ఆయ‌న ఓ అవుట్ డేటెడ్ లీడ‌ర్ అయిపోయాడ‌ని భావిస్తున్నందునే చంద్ర‌బాబు ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేసి మొత్తం ప‌య్యావుల తోనే మాట్లాడిస్తున్నార‌న్న చ‌ర్చ‌లు పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: