ధర తగ్గిస్తారా.. భారత్ వెళ్ళమంటారా.. చైనాకు మెలిక పెట్టిన అర్జెంటీనా?

praveen
ప్రస్తుతం చైనా కూడా ఆయుధాలను యుద్ధ విమానాలను తయారు చేసి ప్రపంచ దేశాలకు విక్రయిస్తూ ఉంటుంది.  చైనా తయారు చేసే అన్ని యుద్ధ విమానాలు కూడా రష్యా దగ్గర కాపీ కొట్టినవే ఉంటాయి అన్న ఒక టాక్ కూడా ఉంది. అయినప్పటికీ పలు దేశాలు చైనా నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తూ ఉంటాయ్. అయితే ఇటీవలే చైనా నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైన అర్జెంటీనా..  చైనా ముందు పెట్టిన ఒక డిమాండ్ తో మాత్రం ప్రస్తుతం చైనా ఎటు తెలుసుకోవాలో తెలియని పరిస్థితిలో పడింది.

 లాటిన్ అమెరికా దేశమైనటువంటి అర్జెంటీనా ఫ్రాన్స్ కి చెందినటువంటి యుద్ధ విమానాలను వాడుతుంది. అయితే ఇప్పటికే వీటి కాలం  కూడా పూర్తయింది. దీంతో చైనా దగ్గర యుద్ధ విమానాల కొనుగోలు చేయాలని భావించింది. ఈ క్రమంలోనే ఇక తాము తయారుచేసిన జెఎఫ్ 17 జెట్ ఫ్లైట్ లను అమ్మడానికి సిద్ధంగా ఉన్నామంటూ అర్జెంటీనా తో చర్చలు జరిపింది చైనా. ఈ క్రమంలోనే అర్జెంటీనా  ఒక మెలిక పెట్టింది.  జెఎఫ్ 17 యుద్ధ విమానాల ధరలు తగ్గించాలని లేదంటే భారత్లో తయారుచేసిన తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తాము అంట చెప్పింది.


 అయితే రష్యా మీగ్ 13  యుద్ధ విమానాల ఇంజన్ కాపీ చేసి జెఎఫ్ 17 యుద్ధ విమానాలకు వాడుతుంది చైనా. అయితే ఇక ఈ యుద్ధ విమానాలు డిజైన్ మాత్రం ఎంతో పురాతన కాలం నాటిది అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ధర తగ్గిస్తేనే  7 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తాం అంటూ మెలిక పెట్టింది అర్జెంటీనా .  అయితే ఆ ధరకు విక్రయిస్తే మిగతా దేశాలకు కూడా యుద్ధ విమానాలు అదే ధరకు విక్రయించాల్సి ఉంటుంది. దీంతో పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉంటుంది.  దీంతో ఇక ఆ ధరకు యుద్ధ విమానాలను విక్రయించ లేము అని చెప్పలేక.. విక్రయించేందుకు సిద్ధంగా లేక అయోమయంలో పడిపోయింది చైనా.  ఒకరకంగా ఈ డీల్ ఫెయిల్ అయితే అటు భారత్కు కలిసి వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: