త్వరలో థర్డ్ ఫ్రంట్ రాబోతుందా.. కాంగ్రెస్ ని పక్కకు తోసేశారా..!

MOHAN BABU

 కేంద్రంలో కొలువుదీరిన బిజెపి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి  సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పై పోటీ చేయడానికి ప్రతిపక్ష పార్టీలు అన్నింటిని ఏక తాటి మీదికి తీసుకురావడానికి ఎన్సీపీ చీఫ్ శరత్ పవర్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ కలిపి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తాజా రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది. ప్రముఖ పోల్  స్టేటజిస్టు  ప్రశాంత్ కిషోర్ తో శరద్ పవర్ బేటీ  దీనికి బలం చేకూరుస్తోంది. సోమవారం  రెండు గంటల సేపు చర్చలు జరిగాయి. ఈ సమావేశం అయిన తర్వాత టీఎంసీ, అఫ్, ఆర్జెడి, సిపిఎం, జెకె నేషనల్ కాన్ఫరెన్స్ సహా 15 పార్టీలకు శరత్ పవర్ ఆహ్వానం పంపినట్లు ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ వెల్లడించారు.
 మంగళవారం సాయంత్రం ఈ 15 పార్టీల ముఖ్యులతో ఢిల్లీలోని  ఆయన నివాసంలో భేటీ కావడానికి నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర మాజీ మంత్రి టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా, ఆర్జేడీ నేత మనోజ్, ఆఫ్ నాయకుడు సంజయ్ సింగ్ లాంటి ముఖ్యులు ఈ  సమావేశంలో  పాల్గొననున్నట్లు తెలుస్తోంది.  మిషన్ 2024 పై ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉందని  పేర్కొన్నాయి. ఈ వ్యూహ, ప్రతివ్యూహాలు  2024 ఎన్నికల  కోసం మాత్రమే కాదని,  రాబోయే యూపీతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఆచరించే ప్రణాళిక పైన  దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
 పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్సేతర   ప్రతిపక్ష పార్టీలు అధికారం అలంకరించడం, వారి పట్టు పెరగడంతో మిషన్ 2024  దారి దొరికినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ, కేరళలో పినరయి విజయన్, తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం    విపక్షల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చాయని చెప్పవచ్చు. వీటితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా,  జార్ఖండ్ లలో కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ సందర్భంగా శరద్ పవార్, ప్రశాంతి కిషోర్ తో, భేటీ జాతీయ స్థాయి వ్యూహాలపై చర్చ జరిగినట్టు కథనాలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్లో కదలికలు కనిపిస్తున్నాయి. ఈ నెల 24న సోనియాగాంధీ పార్టీ జనరల్ సెక్రెటరీలు, రాష్ట్ర ఇన్చార్జులు, పార్టీ అధ్యక్షులతో ఆన్లైన్ లో సమావేశం కానున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: