మాట్లాడు పయ్యావుల... నీ పుణ్యం ఉంటది...?

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు కూడా సమర్థ నాయకత్వం ఎక్కడా కనబడటం లేదు. చంద్రబాబునాయుడు పార్టీని ముందుకు నడిపించాలని భావించిన సరే చాలామంది నాయకుల్లో ఆ ఉత్సాహం కనపడలేదని చెప్పాలి. 2019 నుంచి చాలా మంది నాయకుల మీద కేసులు పెట్టినా సరే చంద్రబాబు నాయుడు వాళ్ళను కాపాడుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ కోసం పూర్తి స్థాయిలో కష్టపడుతున్న సరే నియోజకవర్గాల్లో ఉన్న చాలా మంది నాయకులు పార్టీ గురించి మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు.
అందులో ప్రధానంగా ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా ఉన్న పయ్యావుల కేశవ్ అసలు మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఉరవకొండ నియోజకవర్గంలో ఆయన పెత్తనం చెలాయిస్తున్న సరే గట్టిగా మాట్లాడే విషయంలో మాత్రం పయ్యావుల కేశవ్ ముందుకు రాకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ లో చాలా అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలన్నీ విమర్శిస్తున్న సరే ఆర్థిక పరిస్థితి గురించి ప్రజా పద్దుల కమిటీ చైర్మన్  గా ఉన్న పయ్యావుల కేశవ్ మాట్లాడక పోవడం వెనుక కారణం ఏంటి అనేది ఎవరికీ అర్థంకాని పరిస్థితి.
గతంలో పై ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా చేసిన ప్రతిపక్ష నేతలు అందరూ కూడా చాలా సమర్థవంతంగా వ్యవహరించేవారు. కానీ పయ్యావుల కేశవ్ విషయానికి వస్తే మాత్రం అది ఎక్కడా కనబడటం లేదు. ఆర్థిక పరిస్థితి గురించి యనమల రామకృష్ణుడు మాట్లాడటం అప్పుల గురించి చంద్రబాబునాయుడు మాట్లాడటమే గాని పయ్యావుల కేశవ్ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా ఉండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఒక ప్రసంగం కూడా చేయలేకపోతున్నారు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆయన యాక్టివ్గా కనపడక పోవటంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా కొనసాగితే ఆయనను చంద్రబాబు నాయుడు పక్కన పెట్టినా మంచిదే అని కూడా సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: