ఏళ్లనాటి నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి?

praveen
అంతా సాఫీగా సాగిపోతుంది అని అనుకుంటున్న తరుణంలో ఎంతోమంది జీవితాల్లో ఊహించని ఘటనలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతూ ఉంటాయి.  సంతోషంగా ఉన్న కుటుంబాన్ని అరణ్య రోదనలో ముంచేస్తూ ఉంటాయి.  విధి చిన్నచూపు చూసి అనుకోని విధంగా మరణం సంభవిస్తూ ఉంటుంది   ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఓ వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతనికి భార్య కూతురు ఉన్నారు. జీవితం మొత్తం ఎంతో సాఫీగా సాగిపోతుంది. కానీ అంతలో వారి కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది.

 చివరికి కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తిని బలితీసుకుంది. దీంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్కటూర్ మండలంలో చోటుచేసుకుంది.  రాజు అనే 35 ఏళ్ల వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతనికి భార్య స్వప్న కూతురు అభినయ ఉన్నారు. అయితే ఈ నెల 13వ తేదీన ఇక అదే గ్రామానికి చెందిన కౌలు రైతు భూమిలో ఇక ట్రాక్టర్ నడిపేందుకు వెళ్ళాడు. ఆ పొలంలో ట్రాన్స్ఫార్మర్ నుంచి స్తంభానికి ఒక విద్యుత్తు లైను ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఇక తీగలు వేలాడుతున్నప్పటికీ విద్యుత్ అధికారులు  నిర్లక్ష్యంగానే ఊరుకున్నారు

 ఇక ఆ వైర్లు పంట పొలాన్ని తాకకుండా ఉండేందుకు రైతు తాత్కాలికంగా ఒక కర్ర సపోర్ట్ గా పెట్టాడు  ఈ క్రమంలోనే ఆ పొలం దున్నడానికి ట్రాక్టర్ తో రాజు వెళ్లిన సమయంలో గట్టిగా ఈదురు గాలులు వీచాయ్. దీంతో సపోర్ట్ గా పెట్టిన కర్ర పడిపోయింది. ఇక కిందికి పడిపోయిన తీగలు కాస్త రాజు ట్రాక్టర్ను చుట్టుముట్టాయి. దీంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే చనిపోయాడు రాజు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే తన భర్త చనిపోయాడు అని రాజు భార్య ఆరోపిస్తోంది. 16 ఏళ్ల నుంచి ఆ సమస్య ఉందని చెప్పిన విద్యుత్ అధికారులు పట్టించుకోలేదని చివరికి తన భర్తను కోల్పోవాల్సి వచ్చింది అంటూ కన్నీరుమున్నీరైంది స్వప్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: