తెలంగాణా ఉద్యమం కోసం తొలి ఆత్మహత్య అదే, అతని కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటీ...?

Shanmukha
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశంలో జరిగిన అతిపెద్ద ఉద్యమాల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా ఒకటి. కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్). ఆయన ఈ ఉద్యమాన్ని 2009 సెప్టెంబర్ 29న ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిరాహార దీక్షను చేపట్టారు. ఆ తరువాత కెసిఆర్ పరిస్థితి విషమించడంతో కేంద్రం 9డిసెంబరున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే ఈ ఉద్యమం కోసం ప్రాణాలు త్యజించిన తొలి అమర వీరుడు ఎవరో మీకు తెలుసా?.. ఆ అమర వీరుడి పేరు శ్రీకాంతా చారి.


తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం సాగించిన దమనకాండ, అరెస్టులను శ్రీకాంత్ తట్టుకోలేక పోయాడు. తమ ఉద్యమానికి న్యాయం జరగడం లేదన్న కోపంతో తన మరణమైనా తెలంగాణ ఉద్యమానికి పరిష్కారం చూపుతుందన్న భావనతో ఆత్మహత్య చేసుకున్నాడు. 2009 నవంబర్‌ 29న హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో శ్రీకాంత్ పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఉద్యమజ్వాలను రగిల్చి అగ్నికి ఆహుతి అవుతూ జై తెలంగాణ అంటు నినదించాడు. అంతేకాకుండా నీవైనా న్యాయం చేయమంటూ అంబెద్యర్ విగ్రహాన్ని వేడుకున్నాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలకు కామినేని, యశోద,  ఉస్మానియాలలో చికిత్స అందించారు. చివరికి అపోలో ఆసుపత్రిలో చికిత్స అందుకుంటూ 2009 డిసెంబర్ 3న తన తుది శ్వాస విడిచాడు.

తెలంగాణ కోసం అంతటి త్యాగం చేసిన అతడి కుటుంబానికి జరిగిన న్యాయం మాత్రం ఏమీ లేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో శ్రీకాంతాచారి తల్లికి టీఆర్ఎస్ పార్టీలో సీటు రాలేదు. అంతేకాకుండా 2018లోనూ శ్రీకాంత్ తల్లికి టీఆర్ఎస్ సీటు ఇవ్వలేదు. దాంతో టీఆర్ఎస్‌పై విపక్షాల విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతా చారికి టీఆర్ఎస్ ఏం చేయలేదని, కనీసం అతడి తల్లికి కూడా పార్టీలో సీటు ఇవ్వలేదని దుయ్యబట్టాయి. ఇప్పటి వరకు శ్రీకాంతా చారికి, అతడి కుటుంబానికి దక్కవలసిన గౌరవం దక్కలేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: