వామ్మో.. మాస్క్ పెట్టుకోలేదని అక్కడ మేకులు కొట్టిన పోలీసులు?

praveen
కరోనా టైంలో దేశం మొత్తం మాస్కు ముసుగులో కి   వెళ్లిపోతుంది.  అయితే ఒకప్పుడు మాస్క్ ధరించడానికి ఎంతో చిరాకు పడిన జనాలు.. ఇక ఇప్పుడు మాత్రం మాస్కులు లేకుండా అసలు కాలు బయట పెట్టడం లేదు.  ప్రతి ఒక్కరికి  వైరస్ పై అవగాహన రావడంతో ఇక తప్పనిసరిగా మాస్క్ ధరిస్తు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికికూడా మాస్కు ధరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి పట్ల పోలీసులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. మాస్కు ధరించ లేదంటే చాలు ఇక ఏకంగా వెయ్యి రూపాయల జరిమానా కూడా విధిస్తున్నారు.

 అంతేకాదు కొన్ని రాష్ట్రాలలో వివిధ రకాల శిక్షలు కూడా విధిస్తున్నారు.  ఇక పోలీసులు వేస్తున్న శిక్షలకు భయపడి కూడా ఎంతోమంది మాస్క్ లు ధరిస్తున్నారు.  ఇకపోతే ఇప్పుడు వరకు మాస్కులు ధరించని వారి పట్ల పోలీసులు కాస్త దురుసుగా వ్యవహరించి.. వివిధ రకాల చర్యలు తీసుకోవడం చూశాము. కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం  అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. మాస్క్ ధరించలేదు అన్న కారణంతో ఏకంగా ఒక వ్యక్తి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు పోలీసులు.  అతడి కాళ్లు,చేతులకు ఏకంగా మేకులు దింపేశారు.  అందరినీ షాక్ కి గురి చేసిన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది .

 ఉత్తర ప్రదేశ్ బరేలీ లోని బరాదారి ప్రాంతంలో బాధితుడి తల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మే 24వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో తల్లి కొడుకులు ఇద్దరూ ఇంటి ముందు కూర్చున్నారు. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ముగ్గురు స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక ఈ క్రమంలోనే తల్లీకొడుకులు మాస్క్ ధరించకుండా ఆరు బయట కూర్చున్నారు అన్న కారణంతో వారిని ప్రశ్నించారు. అంతేకాదు కుమారుడితో దురుసుగా ప్రవర్తించారు. ఇక కుమారుడికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఏకంగా సదరు వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లిపోయారు. కాని మరుసటి రోజు తెల్లవారు జామున తీవ్రగాయాలతో కాళ్లకు, చేతులకు మేకులతో దయనీయ స్థితిలో తన కొడుకు కనిపించినట్లు ఆ తల్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇంతకుముందు ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే వాళ్ళు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అటు పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: