కేసీఆరే వస్తే జగన్ కి ఏమయింది?

Chaganti
రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి ప్రతి అంశంలో ఒక రాష్ట్రంతో మరో రాష్ట్రం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు కూడా తెలంగాణను ఆంధ్రాతో పోలుస్తూ ఆంధ్రతో తెలంగాణను పోలుస్తూ వస్తున్నారు. అంతే కాక అక్కడి నాయకులను ఇక్కడి నాయకులతో పోలుస్తున్నారు కూడా. ఈ అంశం చాలా వరకు పోటీతత్వం పెంచే విధంగానే ఉన్నా నాయకులకు మాత్రం తలనొప్పులు తెచ్చిపెడుతోంది. మరీ ముఖ్యంగా జగన్ పాలనతో కేసీఆర్ పాలనని పోలుస్తూ కామెంట్స్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. పాలన కూడా సరిగ్గా మొదలు కూడా పెట్టక ముందే కేసీఆర్ ను కలిసి జగన్ ఆశీర్వాదం తీసుకుని వచ్చారు.  దీంతో పెద్దగా జగన్ కేసీఆర్ మధ్య ఘర్షణ వాతావరణం అయితే లేదు. నీటి వాటాలు విషయంలో తమ రాష్ట్రాలకు న్యాయం చేయమని చెబుతూనే ఒక రాష్ట్రం మీద ఒక రాష్ట్రం ఆరోపణలు చేసుకుంటోంది గాని వ్యక్తిగతంగా ఎక్కడా నాయకుల ప్రస్తావన అయితే లేదు. అయితే ఇప్పుడు కేసీఆర్ జగన్ కి తలనొప్పిగా మారారు. 


ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్ చేస్తున్న పర్యటనలు వైఎస్ జగన్ కు తలనొప్పిగా మారాయి. కెసిఆర్ తాజాగా గాంధీ ఆసుపత్రి సందర్శించారు. ఈ సందర్భంగా కనీసం పీపీ కిట్ కూడా వేసుకోకుండా ఆయన రోగుల వద్దకు వెళ్లి వాళ్లకు ధైర్యం చెప్పారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఒకపక్క కెసిఆర్ ఫ్యాన్స్ బండి సంజయ్ తదితర నేతలతో పోలుస్తో వారి కంటే కేసీఆర్ వయసులో పెద్దవాడు అయినా ఎక్కడా భయం బెరుకు లేకుండా బాధితులకు ధైర్యం చెబుతున్నారు అని కామెంట్ చేస్తున్నారు. 



అలాగే ఆంధ్రప్రదేశ్ లో జగన్ వ్యతిరేక వర్గం కూడా అంత పెద్ద వయసు ఉన్న కేసీఆర్ స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి వాళ్లకు ధైర్యం చెబుతుంటే అన్నిటిలో దేశానికి ఆదర్శం అని దేశం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పుకున్నామని చెప్పుకుంటున్న యువకుడు జగన్ మాత్రం ఎందుకు ఇంట్లో కూర్చుని ఉన్నారనే విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు ఆరోగ్యశాఖ తన వద్ద ఉంచుకున్నారు. అందుకే హాస్పిటల్ కి వెళుతున్నారని, అదీకాక కరోనా వచ్చి తగ్గిన వ్యక్తికి మళ్లీ వెంటనే కరోనా సోకే అవకాశాలు లేకపోవడంతోనే కేసీఆర్ బయటకు వెళ్లి పర్యటన చేస్తున్నారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: