భోజనం తర్వాత.. అస్సలు చేయకూడని పనులు ఇవే?

praveen
నేటి రోజుల్లో ఎవరూ కూడా ఆహారం విషయంలో కాస్తయినా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఒకప్పుడైతే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ పౌష్టిక ఆహారాన్ని తీసుకునే వారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ఇక మంచి పోషకాలు ఉన్న ఆహారం కంటే బాగా మసాలాలు దట్టించిన ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.  వెరసి ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటున్నారు.  ఇక ప్రస్తుత రోజుల్లో జనాలు మొత్తం బద్ధకం గా మారిపోయారు. అటు ఉద్యోగం కూడా ఎలాంటి కష్టం లేకుండా ఒకే దగ్గర గంటల తరబడి కూర్చుని చేసేదిగా ఉంటుంది. అంతే కాకుండా వ్యాయామం చేసేందుకు కూడా ఎవరూ అంతగా ఆసక్తి చూపడం లేదు.

 ఇలా అధునాతన జీవనశైలిలో తినడం,కూర్చోవడం, పడుకోవడం ఇలాగే సాగిపోతుంది అందరి జీవితం. వెరసి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా తిన్న తర్వాత ఎవరూ కూడా తగిన జాగ్రత్తలు పాటించడం లేదు.  ఇలా భోజనం చేయగానే తగిన జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా భోజనం తర్వాత కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదు అని చెబుతున్నారు. ఇక భోజనం తర్వాత కొన్ని రకాల పనులు చేస్తే ఆరోగ్యం దబ్బతినటం ఖాయం అంటూ చెబుతారు.

 ముఖ్యంగా ఆహారం తీసుకున్న వెంటనే ఎప్పుడూ కూడా స్నానం చేయకూడదట.. ఇలా చేయడం వల్ల కడుపులో గ్యాస్ మంట వంటివి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.  ఒకవేళ తప్పనిసరి అనుకుంటే ఇక ఆహారం తీసుకున్న తర్వాత ఒక గంట సేపటి వరకు వేచి చూసి అప్పుడు స్నానం చేయాలని సూచిస్తున్నారు . అంతేకాకుండా భోజనం చేసిన వెంటనే వివిధ రకాల పండ్లు కూడా తినడం మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు. భోజనం తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి పండ్లు తింటే ఎంతో మంచిదని సూచిస్తున్నారు.  ఇక భోజనం చేసిన వెంటనే నిద్రపోవటం శ్రేయస్కరం కాదు అని అంటున్నారు నిపుణులు.

 భోజనం చేసిన వెంటనే నిద్రపోవటం కారణంగా  ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదని ఇక తద్వారా బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అని చెబుతున్నారు.  చాలామంది ఫుల్లుగా ఆహారం తీసుకున్న తర్వాత వ్యాయామం చేయాలి అని అనుకుంటూ ఉంటారు.  కానీ ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.. భోజనం చేసిన తర్వాత వ్యాయామం చేయకూడదని భోజనానికి వ్యాయామానికి కాస్త గ్యాప్ ఇవ్వాలని చెబుతున్నారు. కానీ భోజనం చేయగానే కొంచెంసేపు నడవడం మాత్రం ఎంతో మంచిదని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: