కరోనా ఎఫెక్ట్.. రంగంలోకి దిగిన డిఆర్డిఓ.?

praveen
గత ఏడాది దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో చూసుకుంటే ఈ ఏడాది  వైరస్ ప్రభావం రెట్టింపు అయింది అని చెప్పాలి. దీంతో దేశంలో రోజురోజుకు దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దాదాపు ప్రతి రోజు కూడా మూడు లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు లోకి వస్తూ ఉండటంతో ప్రజలు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. అదే సమయంలో భయం కూడా పెరిగిపోతుంది. ఇక మొదటి రకం  వైరస్ తో పోలిస్తే రెండవరకం కరోనా వైరస్ లక్షణాలు కూడా కాస్త భిన్నంగా ఉన్నాయి ఎక్కువమంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లాంటి సమస్యలతో ఆసుపత్రులలో చేస్తున్నారు.

 ఇక ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా ఆక్సిజన్ అందించడం తప్పనిసరిగా మారిపోయింది ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడే పరిస్థితి వచ్చింది. దీంతో ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు సిద్ధమయ్యింది. దేశంలో ఉన్న అన్ని రకాల పరిశ్రమలు అత్యధిక మోతాదులో ఆక్సీజన్ ఉత్పత్తి చేయాలి అంటూ ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.

 అయితే దేశంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను చెక్ పెట్టేందుకు ఇటీవల డి ఆర్ డి ఓ  కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామంటూ ఇటీవలే భారత రక్షణ పరిశోధన సంస్థ డి ఆర్ డి ఓ ప్రకటన చేయడం గమనార్హం.  తేజస్ యుద్ధ విమానాల టెక్నాలజీతో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ లను అభివృద్ధి చేస్తున్నాము అంటూ తెలిపిన డి ఆర్ డి ఓ.. పీఎం కేర్ నిధి సాయంతో మూడు నెలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్లాంట్ల ద్వారా నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ వరకు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఒక రకంగా ఇది శుభపరిణామమే అని అంటున్నారు విశ్లేషకులు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: