కని కరోనా: వార్డు నుంచి బైక్ పై రోగి జంప్..

Satvika
కరోనా మాట వింటేనే జనాలు వణికిపోతున్నారు.. ఎప్పుడు ఎవరికి వచ్చింది, ఎవరు చనిపోయారు అనే మాట వినాలో అని భయపడుతున్నారు. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలను సైతం కోల్పోయారు. మరి కొందరు మాత్రం గతంలో వచ్చిన కరోనా తో పోలిస్తే ఈ కరోనా భయంకరంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. తినాలన్న కోరిక ను, ఏదైనా ప్రశాంతంగా తాగాలన్నా కూడా చేయలేని పరిస్థితి దాపురించింది. కరోనా సోకిన వాళ్ళు హోమ్ క్వారైంటైన్ లో ఉండగా, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి లో చేరుస్తున్నారు.


అక్కడ అన్నీ వదిలేసి ఉండలేక ప్రాణాలతో పోరాడుతుంటే, మరి కొందరు మాత్రం కోవిడ్ ఆసుపత్రి చూసి పారిపోతున్నారు. అలాంటి ఘటనే ఇప్పుడు కొందరు చేస్తున్నారు. ఓ వ్యక్తి కరోనా కోసం ఆసుపత్రి లో చేరాడు.. అక్కడ వాతావరణం చూసి ఒక్కసారిగ భయం తో చెప్పా పెట్టకుండా పారిపోయాడు.ఈ ఘటన ఇప్పుడు సంచలంగా మారింది. వివరాల్లోకి వెళితే..ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పుదుకోట్టై జిల్లా అరందాంగి పరిసర ప్రాంతాల్లో కరోనా సోకినవారు అరందాంగి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో 32 ఏళ్ల వ్యక్తికి కొవిడ్‌ లక్షణాలు ఉండటంతో సోమవారం పరీక్షలు చేసి కరోనా ప్రత్యేక వార్డులో ఉంచారు..


అయితే.. అతని రిపోర్ట్ రాకుండానే అతన్ని వార్డు లో ఉంచడం పై ఆవేదన వ్యక్తం చేశాడు.ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగాడు. అక్కడున్న తలుపు అద్దం పగులకొట్టి, ఎదురుగా వచ్చిన వారిపై ఉమ్మి వేశాడు. రాత్రి విధుల్లో ఉన్న వైద్యుడు అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించడంతో వైద్యునిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.చివరకు భార్యను ఆస్పత్రికి రప్పించి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించేందుకు ఆస్పత్రి ప్రధాన వైద్యుడు శేఖర్‌ అతని కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. ఆస్పత్రిలో చికిత్స పొందకపోయినా హోం క్వారంటైన్‌లో అయినా ఉండాలని సూచించారు.. కానీ అతను వినకుండా వెళ్ళిపోయాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: