చంద్రబాబు, లోకేష్‌ ప్రచారం చేసినా కనిపించని స్పందన..

Satvika
వరుస ఎన్నికల్లో ఓటములను చూసిన టీడీపీ పరిస్థితి నీరుగారినట్లు అయ్యింది. అభ్యర్థిగా పోటీ చేసిన కూడా ఓటమి తప్పదు అని భావించిన నేతలు తిరుపతి ఉప ఎన్నికల్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.గెలిచే అవకాశం ఏ కోశానా కనిపించక పోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ శ్రేణులు ప్రచారం చేయడానికి అంత ఆసక్తి చూపడం లేదు. వారం రోజుల నుంచి చంద్రబాబు తిరుపతి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించి కొన్ని చోట్ల ఇంటింటి ప్రచారం చేసినా స్పందన కనిపించలేదని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నారు..


అంతకు ముందు లోకేష్‌ ప్రచారం చేసినప్పుడు కూడా జనం పట్టించుకోకపోవడంతో కార్యకర్తల్లో మరింత అసంతృప్తి ఆవహించింది.వారి సభలకు జనాన్ని సమీకరించడమే స్థానిక నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారిందంటున్నారు. సభలకు వచ్చేందుకు జనం ఆసక్తి చూపించ లేదని, బలవంతంగా తీసుకువచ్చిన జనం కూడా చంద్రబాబును పట్టించుకోలేదనే చర్చలు వెనక జరుగుతున్నాయి. అంతేకాదు అలా వచ్చిన జనం కూడా బాబు పై గుస్సా చూపిస్తున్నారు.కింజరపు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ వంటి నేతలు హడావుడిగా తిరుగుతూ సమీక్షలు నిర్వహించడం, మీడియాలో హడావుడి చేయడం తప్ప తమకు ప్రజల్లో ఎటువంటి అనుకూలత కనిపించడం లేదని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


చిత్తూరు జిల్లా సత్యవేడు, వెంకటగిరి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో ఆ పార్టీని నడిపించే సరైన నాయకులే లేరు. దీంతో క్యాడర్‌ నిస్తేజంలో ఉంది. గూడూరు నియోజకవర్గం.. ప్రస్తుతం పోటీలో ఉన్న పనబాక లక్ష్మి సొంత ప్రాంతం కావడంతో ఆమె పరిచయాలు కొంత ఉపయోగపడతాయనే ఆశతో ఉన్నారు. సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని జనం పట్టించుకునే పరిస్థితి లేదు. శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుదీర్‌రెడ్డి అంత చురుగ్గా లేకపోవడంతో పార్టీ శ్రేణులు సైతం దిగులు చెందుతున్నారు.. చంద్రబాబు తిరుపతి నియోజకవర్గంపైనే ఆశలన్నీ పెట్టుకున్నా అక్కడి నియోజకవర్గ ఇన్‌ఛార్జి సుగుణమ్మపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి జనాల్లో ఆలోచనలు తెప్పించడానికి రాళ్ల డ్రామాకు తెర తీసినట్లు తెలుస్తుంది.వీళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు ఊరట నిస్తాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: