బాబుకి ప్లస్ అవుతున్న రెడ్డి నేతలు....మైనస్ అదొక్కటేనా?

M N Amaleswara rao

సాధారణంగా తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజికవర్గం నేతల డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాగే వైసీపీలో రెడ్డి నాయకుల ఆధిక్యం ఉంటుంది. ఇక ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కమ్మ నేతలు ఎక్కువగా కనిపిస్తారు. అప్పుడే ఆ సామాజికవర్గం నాయకులు తమకు కావాల్సిన పనులు చేయించుకుంటారు.


అయితే ఓడిపోయాక మాత్రం ఆ సామాజికవర్గం నేతలు అడ్రెస్ ఉండరని, సొంత పార్టీ వాళ్లే చెబుతుంటారు. ఎందుకంటే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కమ్మ నాయకులు ఏ రేంజ్‌లో హడావిడి చేశారో అందరికీ తెలిసిందే. ఇక ఆ సామాజికవర్గం వల్ల టీడీపీలో ఉన్న ఇతర వర్గాలు పెద్దగా ఎదగకలేకపోయాయి. దీని ఫలితంగానే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. అలాగే టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కొన్ని బీసీ సామాజికవర్గాలు ఆ పార్టీకి దూరమయ్యాయి.


ఇక అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసిన కమ్మ నేతలు, అధికారం కోల్పోయాక కనబడటం తగ్గించేశారు. ఏదో నలుగురైదుగురు నేతలు తప్పా, మిగతా కమ్మ నాయకులు సైలెంట్ అయిపోయారు. అయితే సొంత సామాజికవర్గం సైలెంట్ అయినా, చంద్రబాబుకు రెడ్డి సామాజికవర్గం నేతలు గట్టిగానే సపోర్ట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో రెడ్డి వర్గం నేతలు చాలా తక్కువగా ఉంటారు.


కానీ ఉన్న నేతలు బాబుని విపరీతంగా అభిమానిస్తారు. ఇక అలా అభిమానించే వాళ్ళల్లో మాజీ మంత్రి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందువరుసలో ఉంటారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఈయన, చంద్రబాబుకు ఎప్పుడు సపోర్ట్‌గానే ఉంటారు. ఇక ప్రస్తుతం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో టీడీపీ గెలుపు కోసం రెడ్డి నేతలే ఎక్కువ కష్టపడుతున్నారు. సోమిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుధీర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆనం వెంకటరమణ రెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే తిరుపతిలో టీడీపీ గెలుపు కోసం పలువురు రెడ్డి నేతలు కష్టపడుతున్నారు.  ఏదేమైనా రెడ్డి నేతలు టీడీపీకి ప్లస్ అవుతుంటే, కమ్మ నేతలు మైనస్ అవుతున్నారనే చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: