43% ఫిట్ మెంట్ కి ఏపీ సర్కారు ఓకే ..!!

Edari Rama Krishna

గత ఎనిమిది రోజుల నుంచి ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె జరుగుతుంది. దీంతో ప్రజలు చాలా ఇక్కట్ల పాలయ్యారు  ఈ విషయంలో ఇరు రాష్ట్ర మంత్రులు ఆర్టీసీ అధికారులు కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ పట్టిన పట్టు వీడకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగించారు.  అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ఎనిమిది రోజులుగా దిగ్బంధించిన ఆర్టీసీ సమ్మె సమస్య బుధవారం ఓ కొలిక్కి వచ్చింది.


సమ్మె సమయంలో ఆర్టీసీ డిపో వద్ద భద్రత


ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు, మంత్రి వర్గ ఉప సంఘంతో జరిపిన చర్చలు ఫలించాయి. కార్మికులకు 43 శాతం ఫిట్‑మెంట్ ఇచ్చేందుకు ఏపీ సర్కారు ఆమోదం తెలిపిందని కార్మిక సంఘాలు వెల్లడించాయి. అయితే బకాయిల విషయంలో మాత్రం ఇంకా చర్చలు జరుగుతున్నాయి. దీంతో సమ్మె ముగిసిందని... వెంటనే కార్మికులంతా విధుల్లో చేరాలని పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా, తమ డిమాండ్లకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కార్మిక సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: