రాఘవేంద్రుడు వద్దంటున్నా ఇచ్చారండోయ్‌!!

KSK

కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత.. దాదాపు సంవత్సరం పాటు కీలకమైన నామినేటెడ్‌ పదవుల పందేరాన్ని ఆపి ఉంచిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ఎట్టకేలకు టీటీడీ బోర్డును ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌ రేసు నుంచి తప్పుకున్నందుకు తిరుపతికే చెందిన చదలవాడ కృష్ణమూర్తికి టీటీడీ అధ్యక్షపదవిని కట్టబెట్టారు. ఇంతవరకు ఓకే. అందరికీ తెలిసిందే. 


కృష్ణమూర్తికి టీటీడీ అధ్యక్షపదవిని కట్టబెట్టారు


టీటీడీ బోర్డులో సభ్యుడిగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు కూడా అవకాశం దక్కింది. అయితే అభిజ్ఞవర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. రాఘవేంద్రరావు వద్దు వద్దంటున్నా కూడా చంద్రబాబునాయుడు బలవంతంగా ఆయనకు ఈ పదవిని కట్టబెట్టారుట. ఇంతకూ రాఘవేంద్రరావు పదవిని వద్దనడం అంటే.. ఆయనేదో త్యాగం చేసేస్తున్నారని అనుకుంటే పొరబాటే. టీటీడీ బోర్డు సభ్యుడి పదవి అనే దానిని రాఘవేంద్రరావు అవమానంగా ఫీలయ్యారట. 


బోర్డులోనే ఉండనని ఆయన చంద్రబాబుతో తెగేసి చెప్పారుట.


ఇస్తే తనకు టీటీడీ అధ్యక్షపదవి ఇవ్వాలని లేకపోతే అసలు బోర్డులోనే ఉండనని ఆయన చంద్రబాబుతో తెగేసి చెప్పారుట. నిజానికి చంద్రబాబు వద్ద టీటీడీ అధ్యక్ష పదవి కోసం చాలా గట్టిగానే ప్రయత్నించిన ప్రముఖులు మరికొందరు కూడా ఉన్నారు. నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, అలాగే చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఐఏఎస్‌ అధికారి ఒకరు, తెదేపాలో ఇటీవల చేరిన కొందరు పారిశ్రామికవేత్తలు ఇలా.. పలువురు ఆ పదవికోసం పోటీ పడ్డారు.

తనకు అసలు ఏమీ అక్కర్లేదని మొండికేసిన దర్శకేంద్రుడు



అయితే చంద్రబాబు మాత్రం.. ఎన్నికలకంటె ముందుగా చదలవాడకు ఇచ్చిన మాటకే కట్టుబడ్డారు. వారెవ్వరి విజ్ఞప్తుల్ని ఖాతరు చేయలేదు. ఈ క్రమంలోనే.. అధ్యక్షపదవి ఇవ్వకుంటే.. తనకు అసలు ఏమీ అక్కర్లేదని మొండికేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును కూడా చంద్రబాబు స్వయంగా బుజ్జగించి మరీ పదవి కట్టబెట్టారు. జాబితాలో ఇంకా పిల్లి అనంతలక్ష్మి, వైటి రాజా, కొల్లా లలిత కుమారి తదితరులున్నారు.
పాపం రాఘవేంద్రుడు.. తన స్థాయికి తగని పోస్టు అనుకుంటూనే రాబోయే ఏడాదిరోజులూ ఇందులో అడ్జస్ట్‌ కావాలన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: