ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్ధాలు తినాలో తెలుసుకోండి.. !

Suma Kallamadi
ఈ ఆధునిక కాలంలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు.ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అధిక  ధూమపానం, సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్,  హానికరమైన టాక్సిన్‌లను పీల్చడం వంటివి  ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీసే ప్రధాన  అంశాలు.ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గించడంలో మీ ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఫైటోకెమికల్స్  యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న కొన్ని ఆహారాలు ఉన్నాయి, ఇవి కెమోప్రెవెన్టివ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి, ఇవి క్యాన్సర్ కణాలను మెటాస్టాసైజ్ చేయడానికి మరియు క్యాన్సర్ కణాల మరణాన్ని ప్రేరేపించడానికి నిరోధిస్తాయి. మరి ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ఉండడానికీ మీ రోజువారీ ఆహారంలో ఎలాంటి ఆహార పదార్ధాలు తినాలో ఒకసారి తెలుసుకోండి.

ప్రతిరోజు క్యారెట్లని ఆహారంలో భాగంగా తినాలి. వీటిలో  బీటా కెరోటిన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఇతర విటమిన్లు,  ఖనిజాల పుష్కలంగా ఉంటాయి. అలాగే  బెర్రీస్, స్ట్రాబెర్రీ  బ్లాక్బెర్రీస్ వంటి బెర్రీలు అనేక ఫైటోకెమికల్స్,  యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి క్యాన్సర్ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సహా వివిధ రకాల క్యాన్సర్లలో కణితుల పెరుగుదలను నిరోధించడంలో బెర్రీలు ప్రభావవంతంగా ఉంటాయి.అలాగే యాపిల్స్‌ తినడం వలన  ఊరితిత్తుల క్యాన్సర్  వచ్చే ప్రమాదం తగ్గుతుంది త.ఈ పండు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. రోజుకు ఒక ఆపిల్ తింటున్న మహిళలు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడరు. అలాగే బేరిపండ్లలో యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అలాగే గ్రీన్ టీలో ఎపిగాల్లోకాటెచిన్ -3-గాలెట్ (ఇజిసిజి) కాటెచిన్స్ వంటి ముఖ్యమైన సమ్మేళనాలు ఉన్నాయి.  రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం క్యాన్సర్ రాదు.అలాగే ఆకుకూరలు, కాలే, బచ్చలికూర, పాలకూర లో లుటిన్, జియాక్సంతిన్ ఇతర యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. టొమాటోస్‌లో లైకోపీన్ అనే సహజ వర్ణద్రవ్యం ఉంటుంది, ఇది టమోటాలకు వాటి సహజ ఎరుపు రంగును ఇస్తుంది. లైకోపీన్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాల పెరుగుదలను, రొమ్ము,  కడుపు, పెద్దప్రేగు, ప్రోస్టేట్, నోటి క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపివేస్తుందని తేలింది. వీటన్నిటితో పాటు దూమపానం కూడా చేయకుండా ఉంటే చాలా మంచిది..!!








మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: