ఇలా మాత్రం చేయకండి.. విమానం నుండి దింపేస్తారు..?

praveen
చైనాలో   వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా  వైరస్ భారత్లో కూడా ఎంతలా  ప్రకంపనలు సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది ఈ క్రమంలోనే ఆ తర్వాత కాలంలో ప్రతి ఒక్కరికి వైరస్ పై అవగాహన పెరిగి పోవడంతో ఇక ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించడం భౌతిక దూరం పాటించ డం లాంటివి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇక ప్రతి ఒక్కరు లో కరోనా వైరస్ పై అవగాహన పెరిగిపోవడంతో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారత్లో తగ్గిపోయింది.

 అదే సమయంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ఇక ప్రజలలో ధైర్యం వచ్చింది అని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో.. చాలామంది కరోనా వైరస్ ని లైట్ తీసుకుంటూ ఇక మాస్క్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం భౌతిక దూరం పాటించక పోవడం లాంటివి చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. తద్వారా కొన్ని రాష్ట్రాలలో మళ్లీ కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం అందరిలో కరోనా వైరస్ పై భయం పోవడంతో ఇక అటు విమానాశ్రయాల్లో కూడా ఎంతోమంది వైరస్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

 వెరసి ఎంతో మంది వైరస్ వ్యాప్తికి కారకులుగా మారిపోతున్నారు అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవలే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రయాణికుల విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా విమాన ప్రయాణికుల నిర్లక్ష్యం పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ నిబంధనలు పాటించని వారిపై శిక్షార్హమైన చర్యలు తీసుకోవాలని డి సి జి ఎ, విమాన సర్వీసులకు మార్గదర్శకాలు జారీచేసింది. ఎవరైతే మాస్కు పెట్టుకోరో వారిని విమానం బయలుదేరే ముందు  కిందికి దింపేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై 15 రోజుల లోగా నివేదిక అందించాలి అంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: