గంపెడు టమాటాల కోసం దారుణంగా కొట్టుకున్నారు.. చివరికి

Satvika
ఎక్కడైనా విలువైన వస్తువుల కోసం కొట్టుకోవడం చూసి ఉంటారు.. లేదా ఏదైనా లాభాలు వస్తున్నాయకుంటే ఒకరిపై మరొకరు మాటల యుద్ధం నుంచి రక్తాలు కారేవరకు కొట్టుకోవడం సహజం. ఎక్కడైనా కూరగాయల కోసం కొట్టుకోవడం చూసారా.. అది కూడా  టమోటాల కోసం. గంపెడు టమాటాల కోసం ఓ దేశం రెండు గ్రూప్ లుగా మారి దారుణంగా కొట్టుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజమని చెప్పాలి...కేవలం గంపెడు టమాటల కోసం నైజీరియా దేశస్తులు కొట్టుకోవడం సంచలనం రేపుతున్నది. ఈ ఘర్షణల్లో ఇప్పటిదాకా 20 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

మీరు విన్నది అక్షరాల నిజం.. కేవలం టమోటా ల కోసం పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారు. ఆఫ్రీకా దేశమైన నైజీరియాలో టమాట బుట్ట కారణంగా ఘర్షణలు చెలరేగాయి. దేశం ఉత్తరం, దక్షణం అని రెండుగా విడిపోయింది. ఘర్షణల్లో ఇప్పటివరకు 20 మంది మరణించారు. గత నెలలో ఒక వ్యక్తి బుట్టలో టమాటలతో నైరుతి నగరమైన ఇబాడాన్లోని మార్కెట్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగి టమాటలు రోడ్డుపై పడి అంతటా వ్యాపించాయి.

సమీపంలోని దుకాణదారులు, పోర్టర్‌లతో వాదనకు దారితీసింది. ఆ వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసి పోరాటంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వార్తను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. దేశం ఉత్తర ముస్లింలు-దక్షిణాది క్రైస్తవులు విడిపోయింది. ఈ ఉద్రిక్తత సంఘటన జరిగిన 4 గంటల తర్వాత హింసాత్మక రూపాన్ని సంతరించుకున్నది. అనేక ప్రాంతాల్లో దుకాణాలపై దాడి చేసి పలువురిని అగ్నికి ఆహుతి చేశారు. ఈ హింసలో ఇప్పటివరకు 20 మంది చనిపోయారు. వేలాది మంది ఇండ్లను వదిలి పారిపోయారు. నైజీరియాలోని అతిపెద్ద నగరమైన లాగోస్‌లో మాంసం అందుబాటులో లేకుండా పోయింది. ఈ గొడవను ఆపడానికి వీల్లేకుండా పోయింది.. ఆ గొడవలు మళ్లీ జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కూడా గొడవలు జరుగుతున్నా యని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: