శ్రీకాళహస్తి లో టీడీపీ నేతల ఆందోళన..

Satvika
ఏపిలో పంచాయితీ ఎన్నికల జరుగుతున్న సంగతి తెలిసిందే..నాలుగు విడతలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మూడు విడతల ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయాన్ని అందుకుంది. నాలుగో విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ మేరకు పోలింగ్ కోసం ఎన్నికల కమీషన్ రంగం సిద్ధం చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికలను తగు జాగ్రత్తలతో జరిపించాలని పోలీసు యంత్రాంగం కూడా ప్రయత్నిస్తుంది. చిత్తూరు జిల్లాలో టీడీపీ , వైసీపీ శ్రేణులు మద్య గట్టి పోటీ ఏర్పడింది. మొదటి నుంచి ఇరువురు నువ్వా, నేనా అని దూకుడుగా ప్రవర్తిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరోసారి చిత్తూరు సమస్యాత్మకంగా మారింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ నేతల పై తప్పుడు కేసులు పెడుతున్నారని నేతలు గగ్గోలు పెడుతున్నారు.తెదేపా సానుభూతిపరులపై తప్పుడు కేసులు పెడితే సహించబోమని ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుధీర్‌రెడ్డి అన్నారు. తొట్టంబేడు పోలీసుస్టేషన్‌ వద్ద శుక్రవారం పోలీసుల తీరుకు నిరసనగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కోత సందర్భంగా కూలీలకు నగదు చెల్లించి మిగిలిన రూ.8500 నగదును ఇంటికి తీసుకెళ్తున్న బోనుపల్లికి చెందిన శ్రీనివాసుల నాయుడును పోలీసులు అరెస్టు చేయడం సరికాదన్నారు.

ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు చూస్తున్నామని, ఇలా రైతులపైనా తప్పుడు కేసులు పెట్టి వాళ్లను భయాందోళనలకు గురిచేయడం సరికాదన్నారు.అధికారులను పావులుగా చేసుకుని అధికార పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలని స్టేషన్‌ వద్ద నినాదాలు చేశారు. 'మాకు అందిన సమాచారం మేరకు తనిఖీలు చేశాం. శ్రీనివాసులునాయుడు వద్ద నగదు ఉండటంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశాం' అని  తొట్టంబేడు పోలీసులు పేర్కొన్నారు.. ప్రస్తుతం ఈ విషయం రాజకీయ చర్చలకు దారి తీసింది. రేపు జరగనున్న నాలుగు విడత ల పోలింగ్ లో ఎవరికీ అనుకూలంగా వస్తాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: