అంబటి రాంబాబు పై మండి పడుతున్న జనసేన నేతలు !!

KISHORE
 జనసేన అద్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఇటీవల అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కు పవన్ మద్దతు పలికారంటూ అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ద్వాజమెత్తారు. అయితే తాజాగా అంబటి రాంబాబు కు కౌంటర్ ఇస్తూ జనసేన నేతలు ట్విటర్ లో స్పందించారు. జనసేన అధినేత ను విమర్శించే స్థాయి అంబటి రాంబాబు కు లేదంటూ వ్యాఖ్యానించారు.  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కేంద్రం ప్రకటించగానే మొదటగా స్పందించినది పవన్ కళ్యాణే అని తెలిపారు.
ఆయన డిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాముఖ్యతను, దాని కోసం ఎంతో మంది ప్రజలు చేసిన పోరాటాన్ని వారికి వివరించి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని పవన్ సూచించినట్లు తెలిపారు. అందుకోసమే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంభందించి ప్రైవేటీకరణ చేస్తే వచ్చే నష్టాలను తెలిపారు. రాష్ట్రం లో ఏ రాజకీయ నాయకుడు చెయ్యని విధంగా పవన్ చేస్తే దాన్ని అభినందించేది పోయి అంబటి రాంబాబు విమర్శించడం విడ్డూరంగా ఉందని లేఖలో తెలిపారు. భారత జనతా పార్టీ నాయకులతో పవన్ మాట్లాడినా విషయాలు నీకు చెప్పాలా ..! అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 సి‌ఎం జగన్ ఇంతవరకు ఏ పదవి ఇవ్వలేదని మా నాయకుడి మీద అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఉరుకునేది లేదని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో ప్లాంట్ ఒప్పందం గురించి నీకు..మీ పార్టీ కి ముందే తెలియదా..? అని ప్రశ్నించారు. రాజ్య సభ సాక్షిగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి  దర్మేంద్ర ప్రధాన్ 2019 అక్టోబర్ లోనే పోస్కో ప్లాంట్ ఒప్పందం కుదిరిందని, పోస్కో ప్రతినిదులు సి‌ఎం జగన్ ను కలిశారని చెప్పడాన్ని లేఖలో ప్రస్తావించారు. కేవలం అంబటి రాంబాబు రాజకీయ లబ్ది కోసమే పవన్ కళ్యాణ్ పై అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన నేతలు లేఖలో ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: