రైలు పట్టాలపై పడుకున్న వృద్ధుడు.. కానీ ట్రైన్ రాకముందే ప్రాణాలు పోయాయి..?

praveen
ఎంతో మంది చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు పాల్పడుతూ చివరికి ఎంతో విలువైన ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి.  ఈ మధ్య కాలంలో అసలు మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది.  ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఓ వ్యక్తి ఇలాగే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాడు.  కానీ ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడేందుకు  అతనికి ధైర్యం సరిపోలేదు.


 ఇక ఆ తర్వాత రైలు రాలేదు కానీ భయం తోనే ప్రాణాలు కోల్పోయాడు ఇక్కడ ఒక వ్యక్తి.  ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాయచూరు జిల్లా కోరుకొండ కు చెందిన శివరామిరెడ్డి ఇటీవలే కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నాడు.  దీంతో మంత్రాలయం మండలం తుంగభద్ర ప్రాంతానికి వచ్చి అక్కడ నదిపై ఉన్న రైల్వే ట్రాక్ పై  పడుకున్నాడు. ఇక ఆ తర్వాత అతనికి ప్రాణాలు పోతాయి అన్న భయం వేసింది. ఇక రైలు వస్తుంది అని గమనించిన శివరామిరెడ్డి పట్టాలపై నుంచి తప్పుకొని ట్రాక్ మధ్యలో పడుకున్నాడు.

 ఈ క్రమంలోనే రైలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇక ఆ తర్వాత వెళ్లి పరిశీలించి చూడగా అప్పటికే అతను చనిపోయాడు. అయితే ప్రాణాలు పోతాయి ఏమో అనే భయంతో చివరికి గుండెపోటుతో శివరామిరెడ్డి చనిపోయి ఉంటాడు అని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.  వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్న శివరామిరెడ్డి చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవాలనిఅనుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.  చివరి నిమిషంలో ఆత్మహత్య చేసుకోవాలి అనే నిర్ణయం మార్చుకున్న ప్పటికీ గుండెనొప్పి రూపంలో అతని మృత్యువు కబళించి విషాదాన్ని నింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: