ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వచ్చిన కష్టాలన్నీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నా, అధికారపార్టీ వైసీపీపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ , తన ఉనికిని చాటుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అధినేత చంద్రబాబు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిన ఆయన వైసిపి ప్రభుత్వం హవా  పెరగకుండా చూసుకుంటున్నారు. అయితే ప్రభుత్వంపై పోరాటం చేయాలన్న, ఉద్యమాలు ఆందోళన నిర్వహించాలన్నా, నిత్యం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ  వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నా, అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం లో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గతంలో ఎప్పుడు లేనటువంటి ఆర్థిక కష్టాలు ఇప్పుడు టిడిపిని చుట్టుముడుతున్న ట్టు గా పరిస్థితులు తయారయ్యాయి.




 గత టీడీపీ ప్రభుత్వం లో ఆర్థికంగా బలపడిన చాలామంది నాయకులు అధికార పార్టీ వైసీపీ లోకి జంప్ చేయగా , మిగిలిన కొద్దోగొప్పో నాయకులు మాత్రమే ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నారు. కానీదానికి అవసరమయ్యే సొమ్ములు ఖర్చు పెట్టేందుకు మాత్రం నాయకులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది.చాలామంది నాయకులు ఆర్థికంగా చితికి పోతాము అనే ఉద్దేశంతో సైలెంట్ అయిపోతున్నారు. 




ప్రజా పోరాటాల పై పార్టీ పిలుపు ఇచ్చినా, ప్రభుత్వం పై పోరాడేందుకు అవసరమైన కార్యకర్తలను సమీకరించేందుకు ఇష్టపడడం లేదు. ఈ మధ్యనే పెద్ద ఎత్తున పార్టీ పదవులను భర్తీ చేసినా, ఆ పదవులు తీసుకున్న వాళ్లలో చురుకుదనం లేకపోవడం ప్రభుత్వంతో పోరాటం చేసే విషయంలో నిర్లక్ష్యం వహించడం , కేవలం ఇద్దరు ముగ్గురు నాయకులు మాత్రమే పూర్తిగా యాక్టివ్ గా ఉన్నట్టు గా కనిపిస్తున్నారు. మిగతా వారంతా తూతూ మంత్రంగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, మామ అనిపిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. అయితే  నియోజకవర్గ బాధ్యతలను చూసే నాయకులకు మాత్రం తడిసి మోపెడు అవుతోందట. వీటన్నిటినీ అధిగమించేందుకు పడరాని పాట్లు టిడిపి పడు తూ అలా ముందుకు వెళ్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: