కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెట్టండి.. ఎలాగో తెలుసా..?

N.ANJI
మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించి శుభ్రం చేసేందుకు కిడ్నీలు కీలక ప్రాత పోషిస్తుంటాయి. శరీరం ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీ తన పని తాను చేస్తూ ఉండాలి. అప్పుడే శరీరంలోని మలినాలు తొలగిపోతుంటాయి. కిడ్నీలు పనిచేయకపోతే శరీరం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. అలాంటి పరిస్థితులు ఎదురవకుండా కొన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తే సరిపోతుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
ఆహారంలో తీసుకోవాల్సినవి. వెల్లుల్లిని మూత్రపిండాల రక్షణకు తోడ్పడుతుంది. ఇది మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్లాటింగ్ కణాలు ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు. చాలా రకాల బెర్రీస్ అందుబాటులో ఉంటాయి. బ్లాక్ బెర్రీస్ మినహా మిగిలిన అన్నింటిలో కిడ్నీకి మేలు చేసే న్యూట్రియంట్స్, యాంటీ ఇన్ ప్లమేటరి, క్వాలిటీస్ ఉంటాయి. స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీస్ బ్లూబెర్రీస్ వల్ల వ్యాధి నిరోధకతను పెంచుతుంది.
పెసర్లు, శనగలు వంటి పప్పు ధాన్యాలను రాత్రి నానబెట్టి తడిగుడ్డలో పెడితే ఉదయం వరకు విత్తనాలు మొలకెత్తుతాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని మలినాలను తనతో కలుపుకొని విసర్జింపచేస్తుంది. దీనివల్ల మూత్రపిండాలు శుభ్రపడుతాయి. క్యాబేజీ మూత్ర పిండాల పనితీరును మెరుగుపర్చడంలో ఉపయోగపడుతాయి. సాధారణంగా క్యాబేజీని కిడ్నీలు పాడైపోయినప్పుడు సహజంగా బాగుచేసే శక్తి ఉంటుంది. కిడ్నీలు పాడైపోయినప్పుడు క్యాబేజీ తినడం అలవాటు చేసుకోండి.
ఉల్లిపాయలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి వంటకంలో ఉల్లిపాయలను వాడటం అలవాటు. ఉల్లిపాయలను తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే కిడ్నీల్లో రాళ్లు తొలగించడానికి తోడ్పడుతాయి. మూత్రపిండాలను నిర్విషీకరణ చేయడంలో ఉల్లిపాయలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. శరీరంలో ఉష్ణోగ్రతను కూడా పెంచే లక్షణం ఉల్లిపాయలకు ఉంటుంది. రోజుకు ఒక ఉల్లిపాయలను తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నీరును ఎక్కువగా తాగడం వల్ల కూడా మలినాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. అందుకే ప్రతి పది నిమిషాలకు ఒకసారి నీళ్లు తాగుతుండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: