తిరుపతి ఎన్నికలు... వాళ్ళను పాదయాత్ర చేయమన్న బాబు

తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనే దానిపై అనేక అనుమానాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఆరోపణలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నేతలు గత కొంతకాలంగా చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ కూడా తిరుపతి ఉప ఎన్నికల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ పార్టీని ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది.
ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా విమర్శలు చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇక ముందు భారతీయ జనతాపార్టీని ఘాటుగా విమర్శించే అవకాశాలు ఉండవచ్చు అనేది కొంతమంది చెప్తున్న మాట. రాజకీయంగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కారణంగా చంద్రబాబు నాయుడు పరోక్షంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న బిజెపి కార్యకర్తల వరకు చంద్రబాబు టార్గెట్ గా తీవ్రస్థాయిలో ఇబ్బందులు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం.
రాజకీయంగా అనేక ఇబ్బందులు తెలుగుదేశం పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వైసీపీని ఎదుర్కోవడానికి చంద్రబాబు కొన్ని ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసి పార్టీ నేతల ముందు ఉంచారు. త్వరలోనే కొంతమంది నేతలు తిరుపతి ఉప ఎన్నికల కోసం పాదయాత్ర చేసే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి అమర్నాథరెడ్డి అలాగే gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుధీర్ రెడ్డి పాదయాత్ర చేసే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం. అలాగే తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా పాదయాత్ర చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. మరో ముగ్గురు నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: