అందుకు వచ్చే వారమే ఆమోదం..!

NAGARJUNA NAKKA
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. రష్యా, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, మెక్సికో ఇలా అనేక దేశాల్లో టీకాలు ఇవ్వడం ద్వారా కరోనా చైన్ బ్రేక్ చేసే పనిలో ఉన్నాయి. మనదేశంలో కూడా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్, కోవీ షీల్డ్ కు అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని మొదటి నుంచీ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ లను సిద్ధం చేశాయి. ఇప్పటికే పలు దేశాలు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడంతో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. మన దేశంలో కూడా వచ్చే జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
భారత్ లో ముందుగా కోవీ షీల్డ్ కు అనుమతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎస్ఐఏతో కలిసి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కోవీ షీల్డ్ ను అభివృద్ధి చేసింది. అయితే ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ కోవీ షీల్డ్ ను అభివృద్ధి చేసింది. అయితే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. బ్రిటన్ లో దానికి అనుమతి లభించిన వెంటనే భారత్ కూడా అత్యవసర వినియోగానికి ఆమోదం లభించే అవకాశం ఉంది. సెంట్రల్ డ్రగ్స్ క్యాండెడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సీడీఎస్, సీడీవోలకు చెందిన నిపుణులక కమిటీ సమావేశమైంది.
భద్రత, రోగ నిరోధక శక్తికి సంబంధించిన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి అనుమతిపై నిర్ణయం తీసుకుంటారు నిపుణులు. అయితే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు వచ్చే వారమే ఆమోదం లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: