బాబు సొంత జిల్లాలో టీడీపీలో సంచలనం

Gullapally Rajesh
రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఏంటనే దానిపై స్పష్టత లేదు. కానీ ఇప్పుడు రాయలసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై మాత్రం కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ  సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది ఏంటనే దానిపై ఇప్పుడు చాలా వరకు ఆందోళన ఉంది. పార్టీలో చాలా మంది నేతలు ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. చాలామంది నేతలు పార్టీ ప్రకటించిన పదవుల్లో అవకాశాలు వస్తాయని భావించిన సరే చంద్రబాబు నాయుడు మాత్రం అవకాశం ఇవ్వలేదు.
కొంతమంది యువ నేతలు కూడా ఆయన అవకాశం ఇవ్వకపోవడంతో ఇప్పుడు పార్టీ మారడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రధానంగా gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కుమారుడు gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుధీర్ రెడ్డి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అతను పార్టీ మారడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. తన సన్నిహితులతో ఇప్పటికే ఆయన చర్చలు జరుపుతున్నారని సమాచారం.
త్వరలోనే ఆయన పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. అంతే కాకుండా మాజీ మంత్రి అమర్నాథరెడ్డి కూడా పార్టీ మారే అవకాశాలున్నాయని సమాచారం. అలాగే మాజీ ఎంపీ కూడా ఒకరు పార్టీ మారడానికి రెడీ అవుతున్నారని అంతేకాకుండా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు వద్దకు కూడా వాళ్ళు వెళ్లి విషయం చెప్పారని చంద్రబాబు నాయుడు మాత్రం వారు పార్టీ మారతారు అని చెప్పినా సరే పట్టించుకోలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: