సెల్ఫీ వీడియో తీసుకుంటూ కన్నపిల్లల ముందే మహిళ ఆత్మహత్య..!?

N.ANJI
సెల్ఫీ పిచ్చి ప్రాణాలను తీస్తుంది. సెల్ఫీ.. మీద మోజుతో ఎంతో మంది వారి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తమని తాము రకరకాలుగా చూసుకోవాలనే అతృతతో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రయోగాత్మకంగా సెల్ఫీలు దిగటం కోసం ఆరాటపడుతూ వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారన్నా విషయాన్ని కూడా వారు మర్చిపోతున్నారు. సెల్ఫీలతో సమాజంలో రోజుకు ఎవరో ఒక్కరు వారి ప్రాణాలను పోగొట్టుకున్నారు. హైదరాబాద్‌లోని లాలాపేటలో విషాదం చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని లాలాపేటలో ఓ మహిళ ఆదివారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేట నివాసం ఉంటున్న మంజులకు 12 ఏళ్ల క్రితం వివాహం అయింది. మంజుల భర్త స్థానికంగా ఓ బేకరీని నడుపుతున్నాడు. వీరిని ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు రంజిత్ ఆరో తరగతి, చిన్న కుమారుడు తేజస్ ఐదో తరగతి చదువుతున్నారు. అయితే ఉన్నట్టుండి ఆదివారం మధ్యాహ్నం మంజుల ఆత్మహత్య చేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరివేసుకుంది. దీనిని చివరి క్షణాల్లో గమనించిని మంజుల కుమారులు ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది.
ఇక ఆ సమయంలో బయట ఉన్న తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అతడు వెంటనే ఇంటి వద్దకు చేరుకున్నాడు. అయితే ఆలోపే మంజుల మృతిచెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. మంజుల మృతికి గల కారణాలపై ప్రాథమిక వివరాలు సేకరిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే మంజుల మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఆమె సెల్ఫీ వీడియో రికార్డు అయిందా?, ఒకవేళ రికార్డు అయితే అందులో ఏం చెప్పిందనే విషయం తెలియాల్సి ఉంది. ఇక, తల్లి మృతి చెందటంతో చిన్నారులు విలపించిన తీరు పలువురిని కదిలించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: