మంగళవారం తో ముగియనున్న తుంగభద్ర పుష్కరాలు

Hareesh
12 సంవత్సరాల తరువాత కార్తీక మాసం లో వచ్చిన తుంగభద్ర పుష్కరాలు నవంబర్ 20 న మొదలై డిసెంబర్ 1 న ముగియనున్నాయి.తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహించే ఈ నది పరిసరాల్లో భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కూడలి వద్ద తుంగ మరియు భద్ర అనే రెండు నదులు కలిసి తుంగభద్ర గా ఏర్పడ్డాయి.ఈ రెండు నదులు ముడిగెరె తాలూకు చికమగళూర్ జిల్లాలో పుట్టి దావణగిరి, బళ్లారి జిల్లాల గుండా ప్రవహిస్తు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో కి ప్రవేశిస్తుంది.మన తెలుగు రాష్ట్రాల గుండా ప్రవహిస్తు కర్నూల్ జిల్లాలోని సంగమేశ్వరం వద్ద కృష్ణ నది లోకి కలుస్తుంది.

తెలంగాణ రాష్ట్రం లోని అలంపూర్ పట్టణంలో ప్రభుత్వం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది అలాగే రాజోలి, పుల్లూరు గ్రామాల్లో కూడా ఏర్పాట్లు చేసింది. మరియు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పట్టణం గుండా ఈ నది ప్రవహిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కర్నూలులో ఘాట్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసింది మరియు అలాగే కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, సుంకేసుల ప్రాంతములో భక్తుల సౌకర్యార్థం కోసం అన్నీ ఏర్పాట్లు చేసింది.
ఘాట్లలో మంచి నీటి సదుపాయం, బాత్రుంల ఏర్పాటు, బస్ సౌకర్యం, పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసింది.కర్నూలు జిల్లా కలెక్టర్ మరియు నగర పోలీసు శాఖ ప్రత్యేకంగా పుష్కర ఏర్పాట్లను, సదుపాయాలను పర్యవేక్షిస్తున్నారు.కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలకు అన్నీ అవగాహన ఏర్పాట్లు చేసేలా నది చుట్టుపక్కల పేపర్ హోర్డింగ్స్ ఏర్పాట్లు చేశారు.మరియు దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికుల సౌకర్యo కోసమని పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గాలలో రోడ్ మార్గంలో డైరెక్షన్ గుర్తులు ఏర్పాటు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: