రోజూ ఒక ఎగ్ తింటున్నారా.. అయితే ఆ వ్యాధి వచ్చే ప్రమాదం..!?

N.ANJI
ప్రస్తుతం కాలంలో యువత ఎక్కువగా బయట తినటానికి ఇష్టపడతారు. కొందరు పిజ్జాలు, బర్గర్లు అంటూ నమిలేస్తుంటారు. సరే ఎవరి ఆనందం వారిది. నాలుకకు కూడా కాస్త రుచినివ్వాలని ఒక్కొక్కరు ఒక్కోరకం ఆహారాన్ని తింటారు. జిహ్వకు రోజుకొక రుచిని ఇస్తుంటారు. ఇన్ని తింటున్న కొందరు రోజు గుడ్డును తింటూనే ఉంటారు.
గుడ్డులో కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఇలా చాలా ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్‌ గుణాలు కూడా ఉంటాయి. ఒక యాపిల్‌లో కన్నా దాదాపు రెండింతలు ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లు అందులో ఉంటాయి. ఉదయం ఉడికించిన గుడ్డు తినే జంటలు చాలా త్వరగా గర్భం ధరించవచ్చు. ఉడికించిన గుడ్లు తినడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించవచ్చు.
ఇక గుడ్డులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే గుడ్డులోని మాంసకృత్తులు అమైనో ఆమ్లాలనే ధాతువులతో తయారై ఉంటాయి. సుమారు 20 రకాల అమైనో ఆమ్లాలు కలిస్తే ప్రోటీన్లు తయారవుతాయి. వీటిలో మూడు అత్యవసర అమైనో ఆమ్లాలు ఉంటాయి. వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు. బయటి నుంచి ఆహారం ద్వారానే గ్రహించాల్సి ఉంటుంది. అయితే గుడ్డులో ఎన్ని పోషకాలు ఉన్నాయో.. హాని కలిగించే గుణం కూడా ఉంది.
మీరు రోజు ఒక గుడ్డు లేదా అంతకన్నా ఎక్కువ గుడ్లను తింటున్నారా అయితే జాగ్రత్త. తాజాగా చైనా మెడికల్ యూనివర్సిటీ, కతార్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యాయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. చాలా కాలంపాటు నిత్యం గుడ్లు తినేవారిలో డయాబెటీస్ డెవెలప్ అవుతున్నట్లు ఈ అధ్యాయనంలో గుర్తించారు.
నిత్యం ఒకటికన్నా ఎక్కువ గుడ్లు తింటే వారికి డయాబెటీస్ వచ్చే ముప్పు 60 శాతం పెరుగుతుందని ఎపిడమాలజిస్ట్, పబ్లిక్ హెల్త్ నిపుణుడు మింగ్ లి స్పష్టం చేశారు. చైనాకు చెందిన 8545 మంది(సరాసరి వయస్సు 50)పై ఈ పరిశోధన నిర్వహించారు. ఈ విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. గుడ్డు తినడానికి, డయాబెటీస్ పెరగడానికి గల సంబంధాన్ని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: