పొట్ట తగ్గించుకోవాలా అయితే ఈ బెస్ట్ డైట్ మీకోసమే..!

Kothuru Ram Kumar
చాల మంది పొట్టను సమస్యతో బాధపడుతున్నారు. ఇక పొట్ట లోపల పేరుకుపోయిన కొవ్వును ఎలా కరిగించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. చాల వర్కట్స్ చేస్తుంటారు. ఓ కిలోమీటర్ నడిస్తే చాలు ఆయాసం వచ్చేస్తుంటుంది వారికి. పొట్టలో కొవ్వు కరిగేందుకు ఉలవలు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు చక్కగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇవి తింటూ ఉంటే పొట్ట ఆటేమేటిక్‌గా తగ్గిపోతుంది. అదెలా సాధ్యమో తెలుసుకుందాం.
అయితే వేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి కలుపుకొని అప్పడం నంజుకుంటూ తింటే ఉంటుందీ. రకరకాల వ్యాధుల అంతు చూసే గుణం పెసరపప్పుకి ఉంది. ఈ పప్పు ఈజీగా అరుగుతుంది. దీని నిండా పోషకాలే. ఇది బరువు తగ్గేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువే. అందువల్ల దీన్ని తింటే... ఇంకేమీ తినబుద్ధి కాదు. ఫలితంగా బరువు తగ్గొచ్చు. అంతేకాదు... ఇది ప్రతీ షాపులో దొరుకుతుంది. 10-15 నిమిషాల్లో వంట అయిపోతుంది. ఇది పొట్టే కాదు... శరీర బరువు కూడా తగ్గేందుకు వీలు కల్పిస్తుంది.
మనం ఎర్రపప్పుని ఎప్పుడో గానీ వండుకోం. కానీ ఈ పప్పు కూడా చాలా మంచిది. ఈజీగా జీర్ణం అవుతుంది. దీన్లో చక్కటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అవి బాడీకీ చాలా అవసరం. పైగా ఈ పప్పులో కొవ్వు తక్కువ. ఫైబర్ ఎక్కువ. పైన చెప్పుకున్నట్లు ఫైబర్ వల్ల ఈ పప్పు తిన్నాక పొట్ట నిండిన ఫీల్ కలుగుతుంది. ఉలవలు వల్ల బరువు తగ్గడమే కాదు. ఓవరాల్ హెల్త్‌కి కూడా ఇవి చాలా మంచివి. బాడీకి కావాల్సిన అన్ని పోషకాలూ వీటిలో ఉంటాయి. ఉలవలు పొట్టలో కొవ్వుపై ఎక్కువ ఫోకస్ పెడతాయి. పొట్టలోకి వెళ్లగానే... అక్కడ తిష్టవేసిన కొవ్వును ఛల్ పో అవతలకి అంటూ తరిమికొడతాయి. కిడ్నీలో రాళ్ల అంతు కూడా చూస్తాయి. అందువల్ల ఉలవల్ని రెగ్యులర్‌గా వాడేయాలి. ఉలవచారూ.. బిర్యానీ చేసుకొని తింటే అదిరిపోయే టేస్టీ ఫుడ్ తిన్న ఫీల్ కూడా కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: