అత్తి పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో తెలుసా..?

Kothuru Ram Kumar
అంజీర్‌కు మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అనే పేర్లు కూడా ఉన్నాయి. అత్తి పండు అడుగు భాగం వెడల్పుగా, చదునుగా, పై భాగం సన్నగా గంట ఆకారంలో ఉంటాయి. పండు పండినప్పుడు పైభాగం "గ్రీవము" వంటి ఏర్పాటుతో వంగి ఉంటుంది. అంజీర్ పండ్లు గోధుమ, ఊదా, పసుపు లేదా నలుపు, ఆకుపచ్చ వంటి రంగులతోను పరిమాణంలో విభిన్నంగా ఉంటాయి. అంజీర్‌ చెట్టు అందంగా, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది సుమారు 15 నుంచి 30 అడుగుల ఎత్తు పెరుగుతుంది.
ప్రకృతి సహజంగా అత్తి పండ్లలో ఆరోగ్యానికి కావలసిన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఎండిన అత్తి పండ్లలో ఖనిజాలు మరియు విటమిన్లు యొక్క గాఢమైన మూలం ఉంటుంది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ దీన్ని ఔషధ ఫలంగా వాడతారు. ఇందులో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఏ వ్యాధితో బాధపడుతున్న వాళ్లయినా అత్తి పండును ఎండురూపంలో గానీ, పండుగా గానీ తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. శరీరానికి అవసరమైన శక్తిని వేగంగా అందిస్తుంది.
అంజీర్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహ వ్యాధిని నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎంతో సహాయపడుతుంది. అలాగని మరీ ఎక్కువ అంజీరలు తింటే బరువు పెరుగుతారు. అందువల్ల రోజుకు నాలుగైదుకి మించకుండా తింటే మంచిదే. జీర్‌లో పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువ. అందువల్ల వీటిని తింటే బీపీ తగ్గుతుంది. రాత్రంతా నీటిలో నానబెట్టిన డ్రై అంజీర్‌ను వాటర్‌తో సహా తింటే ఫైల్స్‌ పోతాయి.
ఇక ఈ పండులో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా, బలంగా మారుస్తుంది. ఆస్టియోపోరోసిస్‌ రాకుండా చూస్తుంది. అంజీర్‌లో ఉండే పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఇందులో పీచుపదార్థం ఎక్కువ ఉంటుంది గనుక మలబద్ధక సమస్య దూరమవుతుంది. అల్జీమర్స్‌, మతిమరుపును తగ్గిస్తుంది. వెంట్రుకల ఆరోగ్యానికి అంజీర్‌ చక్కగా పనిచేస్తుంది. పురుషుల్లో లైంగిక సమస్యలకు అంజీర్‌ చక్కని పరిష్కారం. స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు దోహదపడుతుంది. ఇది వయాగ్రాలా పనిచేస్తుంది.
ఆస్తమా, దగ్గు, జ్వరంలాంటి అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: