సోకకుండానే కుటుంబాన్ని చంపేసిన కరోనా..?

praveen
కరోనా  వైరస్ ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే. ఎంతో మంది పై పంజా విసిరిన ఈ మహమ్మారి వైరస్ ప్రాణాలు తీసుకుంటుంది. అయితే కరోనా వైరస్ సోకి ప్రాణాలు పోవడం ఒక ఎత్తు అయితే ఇంకా ఎంతో మంది కరోనా వైరస్ కారణంగా మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి . ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి బతుకు బండిని నడపడం ఎంతో కష్టంగా మారి చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకునే విధంగా పరిస్థితులు తీసుకొస్తుంది మహమ్మారి కరోనా వైరస్.

 వెరసి  ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలో తెర మీదికి వచ్చి ఎంతో మందిని కలిచి వేస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇక వివిధ కారణాలతో అప్పులపాలై ఆ అప్పులు చెల్లించలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎంతోమంది. ఇలా కరోనా వైరస్ సోక  కుండానే ఎంతోమంది ప్రాణాలు తీసింది. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఏకంగా ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. సోక  కాకుండానే ఆ కుటుంబాన్ని బలి తీసుకకుంది  ఈ మహమ్మారి వైరస్. ఆ కుటుంబం యొక్క ధైర్యాన్ని చంపేసి చివరికి వారిని చంపేసింది.

 ఆర్థిక ఇబ్బందులతో అసోంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. గౌహతి లోని కోక్రాఝర్ లో నిర్మల్ పాల్ అనే వ్యక్తి స్థానిక వడ్డీ వ్యాపారుల నుంచి 30 లక్షల వరకు అప్పు చేశాడు. డబ్బులు తిరిగి ఇస్తాను అని అనుకున్నాడు. అయితే అంతలోనే కరోనా వైరస్ సంక్షోభం రావడం తో మరింత ఆర్థికంగా చితికిపోయారు. దీంతో డబ్బులు చెల్లించి లేకపోయాడు. ఇక అప్పు ఇచ్చిన వారి నుంచి రోజురోజుకు ఒత్తిడి ఎక్కువ అవుతున్న తరుణంలో తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో కఠిన నిర్ణయం తీసుకుని భార్య ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: