భారత్లో మొదటి సారి ఆ పంట వేశారు.. ఏకంగా 300 ఎకరాల్లో..?

praveen
భారత్లో ఇంగువ వినియోగం ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. భారతీయులు ఎంతో మంది ఇంగువ ను ఆరోగ్య కరమైన పదార్థం గా భావించి  ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక వంట లో ఎక్కువగా ఇంగువ  ఉపయోగిస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో మాత్రం ఇప్పటివరకు ఇంగువ  పంటను వేయలేదు అనడం లో అతిశయోక్తి లేదు. ఇంగువ  పంటకు సరైన అనుకూలమైన వాతావరణం లేకపోవడం తో భారత్ లో ఇప్పటి వరకు ఎవరూ కూడా ఇంగువ పంటలు పండించ లేదు.

 కానీ ప్రపంచ దేశాల లో పండించే 50 శాతం ఇంగువను  భారతీయులు ఎక్కువగా దిగుమతి చేసు కుంటూ వుంటారు. అందుకే భారత్లో ఇంగువ కు  ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇక ప్రతి వంటకాల లో ఇంగువను వాడుతూ ఉంటారు. ముఖ్యం గా ఇంగువను వాడటం ద్వారా ఎంతో మంచి రుచి వస్తుంది అని నమ్ముతూ ఉంటారు భారతీయులు. అంతేకాకుండా ఇంగువ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.. అందుకే ఎక్కువగా ఇంగువను తినడానికి ఆసక్తి చూపుతుంటారు.

 అయితే భారతదేశం లో ఇంగువ కూడా ఈ రేంజిలో డిమాండ్ వున్నప్పటికీ ఇప్పటివరకు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భారత్లో ఇంగువ పంట వెయ్యలేదు రైతులు. కానీ ఇప్పుడు భారత్ లో ఇంగువ పంటను సాగు చేసి ఘనత సాధించేందుకు భారత శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. హిమాచల్ ప్రదేశ్  శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఇంగువ విత్తనాలను నాటారు. ఇక తొలివిడతగా 300 ఎకరాల్లో ఇంగువ పంటను సాగు చేసేందుకు నిర్ణయించారు. ఇక ఐదు సంవత్సరాల తర్వాత పూర్తి ఫలితాలను సేకరించిన తర్వాత... ఈ పంటను మరిన్ని వందల ఎకరాల్లో విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గత ఏడాది 942 కోట్ల ఇంగువను ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్  దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: