పదవులకు సొంత జిల్లా నేతలే బాబుకి పనికిరాలేదా...?

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పదవులు ప్రకటనపై చాలా వరకు కూడా ఆ పార్టీలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాలకు చెందిన నేతల విషయంలో చంద్రబాబు నాయుడు అనుసరించిన వైఖరిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం విషయంలో చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా వ్యవహరించారు అని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని రాయలసీమ జిల్లాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం ముందు నుంచి కూడా ఆదుకుంటూ వస్తోంది.
అయినా సరే వాళ్లకు పదవి లేకుండా చంద్రబాబు నాయుడు కొంతమందికి మాత్రమే పదవులు ఇచ్చారు. తనకు అనుకూలంగా ఉన్న వారికి... అదే విధంగా గతంలో ప్రత్యర్థులు బినామీలు అని ఆరోపించిన వారికి మాత్రమే పదవులు ఇవ్వడంతో ఇప్పుడు తీవ్ర స్థాయిలో కూడా పార్టీ నేతలు మండిపడుతున్నారు. జేసీ కుటుంబం నుంచి కేవలం దీపక్ రెడ్డికి మాత్రమే అవకాశం ఇవ్వడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోయిన చాలా మంది నేతలను చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా నేతలను కూడా పెద్దగా పట్టించుకోలేదని సొంత జిల్లాలో పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో కనీసం gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణారెడ్డి లాంటి వారిని కూడా ముందుకు తీసుకు రావడానికి ఆసక్తి చూపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర పార్టీ కమిటీ లో మాత్రం వారికి అవకాశం దక్కే సూచనలు కనపడుతున్నాయి. ఇక ఉత్తరాంధ్ర లో కూడా చాలా మంది నేతలను చంద్రబాబు నాయుడు పెద్దగా పట్టించుకోలేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అటు విజయనగరం జిల్లాలో కూడా కేవలం అశోక గజపతిరాజును మాత్రమే చంద్రబాబు నాయుడు పార్టీ పదవులకు ఎంపిక చేశారు. మిగిలిన నేతల విషయంలో చంద్రబాబు నాయుడు చూసి చూడనట్టుగా వ్యవహరించడంపై అసహనం వ్యక్తం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: