ఆ మాజీ బ్యాచ్ అంతా సైకిల్ తొక్కలేకపోతున్నారా?

M N Amaleswara rao
టీడీపీలో మాజీ మంత్రులంతా సైలెంట్ అయిపోయినట్లేనా? ఎప్పుడు ఏ కేసు వచ్చి పడుతుందనే భయంతో నోరు మెదపకుండా ఉంటున్నారా? ఇక వారు సైకిల్ తొక్కడం కష్టమేనా?అంటే ప్రస్తుత పరిస్థితులని చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉండగా అప్పటి మంత్రులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రజలకు మేలు చేసే విషయం పక్కనబెట్టేసి, చంద్రబాబుకు, చినబాబుకు భజన చేయడంలోనే కాలం గడిపారు.
ఇక అలా చేయడం వల్లే 2019 ఎన్నికల్లో ప్రజలు దాదాపు అందరూ మంత్రులని చిత్తు చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. అయితే అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప లాంటివారు మాత్రం మళ్ళీ గెలిచారు. వీరిలో గంటా అటు ఇటు ఊగిసలాడుతున్నారు. ఓడిపోయిన వారిలో దేవినేని ఉమా, అమర్నాథ్ రెడ్డి, భూమా అఖిలప్రియ, నక్కా ఆనందబాబు, reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, జవహర్, కాల్వ శ్రీనివాస్ లాంటి వారు కాస్త యాక్టివ్‌గా ఉన్నారు.
అయితే సుజయకృష్ణరంగరావు, కిమిడి మృణాలిని, పీతల సుజాత, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, పరిటాల సునీతమ్మ, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కేఈ కృష్ణమూర్తి, పల్లె రఘునాథ్ రెడ్డి, gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాల కృష్ణారెడ్డి లాంటివారు అసలు ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. వీరిలో కొందరికి వయసు మీద పడటంతో మళ్ళీ  పార్టీలో కనిపించడం కష్టమని తెలుస్తోంది.
అలాగే మరికొందరు కేసులు ఏమన్నా తెరపైకి వస్తాయనే భయంతో బయటకు రావడం లేదని తెలుస్తోంది. అయితే ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు పార్టీ మారిపోయారు. శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరితే, ఆది నారాయణరెడ్డి బీజేపీలో చేరారు. ఇక మరికొందరు కూడా టీడీపీని వీడే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. వీలుని బట్టి పార్టీ జంప్ కొట్టే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే టీడీపీలో కొందరు మాజీ మంత్రులు సైకిల్ తొక్కలేకపోతున్నారని అర్ధమవుతుంది. మరి వీరు బాబుకు ఎప్పుడైనా షాక్ ఇచ్చేయోచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: