బాబు సొంత జిల్లా జగన్ కంచుకోటగా మారిపోయినట్లేనా..

M N Amaleswara rao
చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత జిల్లా. పేరుకు చంద్రబాబు సొంత జిల్లా గానీ, ఇక్కడ టీడీపీ పెద్దగా సత్తా చాటిన సందర్భాలు తక్కువ. పార్టీ ఆవిర్భావం నుంచి అంటే 1983-1999 ఎన్నికల వరకు కాస్త జిల్లాలో పర్వాలేదనిపించేలా సీట్లు దక్కించుకుంది. కానీ 2004 నుంచి చిత్తూరులో టీడీపీ సత్తా చాటిన సందర్భాలు తక్కువ. ఆఖరికి 2014 ఎన్నికల్లో సైతం ఇక్కడ వైసీపీ హవానే నడిచింది.
రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే, చిత్తూరులో మాత్రం వైసీపీ సత్తా చాటింది. జిల్లాలో ఉన్న 14 సీట్లలో వైసీపీ 8 చోట్ల గెలిస్తే, టీడీపీ 6 చోట్ల విజయం సాధించింది. ఇక 2019 ఎన్నికల్లో పరిస్థితి ఏమైందో చెప్పాల్సిన పనిలేదు. జిల్లాలో 14 సీట్లలో వైసీపీ 13 సీట్లలో ఫ్యాన్ గాలి వీచింది. కేవలం కుప్పంలో మాత్రమే చంద్రబాబు గెలిచారు. పైగా ఆయనకు గతంలో వచ్చిన మెజారిటీ కూడా రాలేదు.
అయితే ఎన్నికలైపోయి ఏడాది దాటేసింది. మరి ఈ ఏడాది కాలంలో జిల్లాలో టీడీపీ ఏమన్నా పుంజుకుందా అంటే అబ్బే అసలు లేదనే చెప్పాలి. అసలు ఇక్కడ ఒక్క టీడీపీ లీడర్ కూడా పార్టీ కోసం కష్టపడటం లేదు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఉందా? లేదా? అన్నట్లు అయిపోయింది. ఇక్కడ మొత్తం వైసీపీ ఎమ్మెల్యేల డామినేషన్ నడుస్తోంది. ఆఖరికి చంద్రబాబు కూడా కుప్పం మొహం చూడటం లేదు.
కాకపోతే పలమనేరులో ఓడిపోయిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కాస్త టీడీపీలో కనిపిస్తున్నారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏ‌ఎస్ మనోహర్ పార్టీని వీడి వెళ్ళిపోయారు. పూతలపట్టు నియోజవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి టీడీపీకి రాజీనామా చేశారు. ఇక మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ పీలేరులో అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి అందుబాటులో ఉండటం లేదు. నగరిలో గాలి భాను ప్రకాశ్, చంద్రగిరిలో పులివర్తి నాని, గంగాధరనెల్లూరులో హరికృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు అడ్రెస్ లేరు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ జగన్ హవా నడవటం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి బాబు సొంత జిల్లా జగన్ కంచుకోటగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: