పొగాకు తాగితే కరోనా వైరస్ రాదా..?

Suma Kallamadi
పొగాకు, నికోటిన్ వినియోగించడం వలన కరోనా వైరస్ సంక్రమించడం జరగదని అనేక కథనాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఫ్రాన్స్ నిర్వహించిన ఒక అధ్యయనంలో పొగాకు తాగడం వలన కరోనా సంక్రమించదని తేలినట్టు చాలా వార్తలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఫ్రాన్సు దేశం నిర్వహించిన అధ్యయనంలో పొగాకు తాగడం వలన కరోనా రాదని తేలింది కానీ పరిశోధకులు తాము చేసిన అధ్యయనం అసంపూర్ణంగా ఉందని తేల్చి చెప్పేసారు. సాక్షాత్తు పరిశోధన చేసిన శాస్త్రవేత్తలే తమ అధ్యయనం నమ్మడానికి వీలు లేదని చెప్పారు కానీ అది ఎవరూ వినిపించుకోకుండా ఈ అధ్యయనం గురించి బాగా ప్రచారం చేస్తున్నారు.

చిట్టచివరికి ఈ అధ్యయన ప్రచారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ అధ్యయనం ఏ ఒక్కరూ కూడా సీరియస్ గా తీసుకోకూడదని... పొగాకు, నికోటిన్ వినియోగం వలన ఊపిరితిత్తులు ఆరోగ్యం క్షీణించి పోతుంది. ఫలితంగా కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ విధంగా చూసుకున్నా పొగాకు, నికోటిన్ వంటివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. వాటిని వినియోగించడం వలన మేలు కంటే ఎక్కువగా హానీ జరుగుతుంది. అందుకే ఎటువంటి అధ్యయనాలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ పొగాకు దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది.

పొగాకు తాగే వారు తరచుగా తమ చేతి వేళ్ళను నోటి దగ్గర పెట్టుకుంటుంటారు. ఇలా చేయడం వలన చేతికి అంటుకున్న వైరస్లు, బాక్టీరియా ఇతర క్రిములను శరీరంలోకి వెళ్లిపోతాయి. పొగ తాగే అలవాటు ఉన్నవారికి ఈ విధంగా కరోనా సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొగ తాగే అలవాటు ఉన్నవారికి కరోనా సంక్రమిస్తే వారి మరణం తధ్యమని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా సమయంలో గుట్కా వంటివి కూడా వినియోగించడం చాలా ప్రమాదకరమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పొగాకు తాగేవారికి షుగర్ వ్యాధి, గుండె జబ్బులు, క్యాన్సరు, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం గుర్తుకు తెచ్చింది.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: