వాట్సాప్ గ్రూప్ లను క్రియేట్ చేయిస్తున్న విజయసాయి...!

ఏపీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే... అధికార వైసీపీ చాలా వరకు బలంగానే ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం నేతలు కాస్త అసహనంగా ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. పార్టీలో  ఎప్పటి నుంచో ఉన్న నేతలకు సరైన గుర్తింపు లేదు అని, వాళ్ళు పదవుల కోసం చూసినా సరే పదవులు రావడం లేదు అనే భావనలో ఉన్నారు. పార్టీ కోసం అన్ని విధాలుగా కష్టపడినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదవులు రావడం లేదు అనే భావనలో ఉన్నారు.  పార్టీ కోసం ఆర్ధికంగా నష్టపోయిన నేతలు కూడా చాలా మందే ఉన్నారు. 

 

ఇప్పుడు వారు అందరూ కూడా ఎవరిని కలవాలి, ఏం చేయాలి అనే దాని మీద స్పష్టత లేకుండా ఉన్నారు. ఒకప్పుడు పార్టీ కోసం ఉత్సాహంగా పని చేసిన వాళ్ళు, ఇప్పుడు పార్టీ బలంగా ఉన్నా సరే ఏమీ చేయలేని స్థితిలో ఉండటం కార్యకర్తలను కూడా ఇబ్బంది పెడుతుంది. ఈ నేపధ్యంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి వారి జాబితా సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఉత్తరాంధ్ర బాధ్యతలను ఇటీవల సిఎం జగన్ ఆయనకు ఇచ్చారు. అందుకే ఇప్పుడు ఉత్తరాంధ్ర లో ఉన్న నేతలతో ఆయన మాట్లాడుతున్నారు. 

 

వాట్సాప్ గ్రూప్ లను ఆయన క్రియేట్ చేయించి, పార్టీ స్థానిక నాయకత్వాన్ని యాడ్ చేయిస్తున్నారు. వారి అందరితో నేరుగా మాట్లాడి ధైర్యం నింపుతున్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు పడే వారికి కూడా అండగా ఉండాలి అని  ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారట. ఉత్తరాంధ్రలో పార్టీకి సంబంధించి, కొందరు నేతలను ఇప్పటికే గుర్తించి వారిని ఆయన కలిసారట. కరోనా తగ్గిన తర్వాత వారి అందరితో కూడా విజయసాయి మాట్లాడి... పార్టీ నుంచి ఏం చేస్తే బాగుంటుంది అనేది అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారట. త్వరలోనే ఈ కార్యక్రమం ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: