విషాదం : పుట్టుకలోనే కాదు.. చావులోనూ కూడా ఆ కవలలు విడిపోలేదు..?

praveen

విధి ఆడిన వింత నాటకంలో మనుషుల జీవితాలు కీలుబొమ్మలు. ఇక్కడ అన్నదమ్ములను చూసి విధి ఓర్వలేక  పోయింది. పుట్టుకలోనే  కాదు చావులోను  కూడా ఇద్దరూ ఒకరితో ఒకరు ఉన్నారు. ఒకేసారి ఇద్దరు కవలలు  చనిపోయిన విషాద ఘటన కుటుంబాన్ని మొత్తం శోకసంద్రంలో కి నెట్టింది. ఒకరిని విడిచి ఒకరు  ఉండలేక ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ విషాదకర ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం పేట గ్రామానికి చెందిన వేమన చందు, రమేష్  లు కవల సోదరులు. 

 

 చందు పుట్టిన 7 నిమిషాలకి రమేష్ పుట్టాడు. ఇద్దరు కవలలు చిన్నప్పటినుంచి ఎంతో అన్యోన్యంగా పెరిగారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వీరిద్దరి మధ్య బంధం బలపడింది. కానీ  ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమను చూసి విధి  ఓర్వ లేక పోయింది. అందుకే ఒకరి తర్వాత ఒకరిని మృత్యుఒడిలోకి చేర్చింది. తల్లి కడుపు నుంచి ఒకేసారి బయటకు వచ్చిన అన్నదమ్ములు చావులో కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు కవలల్లో  రమేష్ అనే యువకుడికి మద్యం అలవాటు ఉంది. ఈ మధ్యకాలంలో  మధ్యనికి మరింత బానిస గా మారిపోయాడు రమేష్. 

 

 ఈ క్రమంలోనే గ్రామంలో మద్యం దొరకకపోవడంతో.. మందు తాగకుండా వుండలేక పోయిన రమేష్ అందుకు బదులుగా శానిటైజర్ తాగాడు.  ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయాడు రమేష్. తమ్ముడి మరణవార్త చందూ ని  తీవ్రంగా కుంగదీసింది. పుట్టుకలో తనతోపాటు వచ్చి  చిన్నప్పటినుంచి తనతోపాటే పెరిగిన తన తమ్ముడు ఇక లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు చందు .తాను  ఒంటరి వాని అయిపోయాను అని బాధతో కుమిలిపోయాడు. మరుసటి రోజు రమేష్ అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో  అమాంతం కుప్పకూలిపోయాడు చందు. హుటాహుటిన బంధువులు చందు ని  ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. అయితే ఇద్దరు కవలల మరణం తో  గ్రామం లో పెను విషాదం నిండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: