ఆ పథకం విషయం లో జగన్ ని ఇరికించేసిన టీడీపీ ?

KSK

వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు తన ప్రభుత్వం కులాలకు, మతాలకు, పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ఉంటుందని జగన్ తెలపడం జరిగింది. అవినీతికి ఎక్కడా చోటు ఉండదు అంటూ పెద్ద పెద్ద డైలాగులు సీఎం జగన్ ఆరోజు వేయడం జరిగింది. చెప్పినటుగాన్నే అధికారంలోకి వచ్చాక చాలావరకూ ఎక్కడ కూడా తారతమ్య భేదాలు చూపించకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా జగన్ వ్యవహరించడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఇటీవల జగన్ ప్రారంభించిన ఓ పథకం విషయంలో కొంత మందికి లబ్ధి చేకూరే విధంగా అది కూడా జగన్ పార్టీకి సంబంధించిన వారే అన్నట్టుగా లబ్ధిదారుల లిస్టు ఉన్నటు టీడీపీ ఆరోపిస్తూ ఈ విషయంలో జగన్ ని ఇరికించింది.

 

పూర్తి మేటర్ లోకి వెళితే ఇటీవల “జగనన్న చేదోడు” అనే పథకం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. జగన్ ప్రతిపక్ష నాయకుడు ఉన్న టైంలో పాదయాత్రలో హామీ ఇచ్చినట్లుగా…రజకులు, నాయీ బ్రహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ. పదివేలు సాయం చేసేందుకు “జగనన్న చేదోడు” అనే పథకాన్ని ఇటీవల ప్రారంభించారు. చెప్పినట్టుగానే వారందరితో వారి వారి జిల్లాలలో వీడియో సమావేశం ఏర్పాటు చేసి డబ్బులు వేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో 5 లక్షల 50 వేల మంది నాయి బ్రాహ్మణులు ఉండగా…. కేవలం 38 వేల మందికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా వైసీపీ వ్యవహరించిందని టీడీపీ ఆరోపిస్తోంది.

 

అంతేకాకుండా రాష్ట్రంలో 13 లక్షల మంది టైలర్లు ఉండగా… అందులో లక్షా 25 వేల మందికే ఆర్థిక సాయం చేస్తున్నారని.. ఇదే క్రమంలో రజకులు 15 లక్షల మంది ఉంటే 82 వేల మందికే సాయం చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.  5 లక్షల 50వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులు ఉండగా... రెండున్నర లక్షల మంది లబ్దిదారులు మాత్రమే ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడం వెనకాల సొంతపార్టీ వారికే వైసీపీ లబ్ధి చేకూర్చే కార్యక్రమానికి 'జగనన్న చేదోడు' టైటిల్ పెట్టినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: