పని లేక కుటుంబ పోషణ కష్టమై వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య ...!

Kothuru Ram Kumar

కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ కారణంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు రోజు వారి జీవనం కూడా సరిగా జరగని రోజులు కూడా ఉండడంతో.... బాధలను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి లో లాక్ డౌన్ కారణంగా తో ఓ నాయి బ్రాహ్మణుడు కి రోజు గడవక మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.


కాళహస్తిలోని ప్రాజెక్టు వీధికి చెందిన వెంకటరమణ... తన కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని ముందుకు కొనసాగిస్తూ వచ్చేవాడు. లాక్ డౌన్ కారణంతో ఉపాధి లేకపోవడంతో అన్నం తినని పస్తులు కూడా ఉంటున్నారు. ఒకవైపు కుటుంబాన్ని పోషించలేక మరోవైపు అప్పుల భారంతో... అతను బలవన్మరణానికి పాల్పడినట్లు అర్థమవుతుంది. మరోవైపు జిల్లాలో శ్రీకాళహస్తిలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ కి వెళ్లి వచ్చిన వారు వల్ల కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య జిల్లాలో అత్యధికంగా చోటుచేసుకుంటున్నాయి. 


అంతేకాకుండా కరోనా విధుల్లో ఉన్న ఉద్యోగులు కూడా వైరస్ రావడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఆ ప్రాంతంలో.  ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పట్లో దుకాణాలు తెరుచుకునే పరిస్థితి కనబడటం లేదు. సుమారు రెండు నెలలకు పైగా ఉపాధి లేకపోవడంతో ఆ వ్యక్తి ఇన్ని రోజులు అప్పులతో కుటుంబాన్ని ముందుకు కొనసాగించాడు. ఇక దీనితో సంసారం బాధ్యత భారంగా పెరిగిపోయింది. ఇక అప్పులు తీర్చలేక వడ్డీ తీర్చే దారి లేకపోవడంతో అతను ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్న అది వారి కుటుంబాల పోషణకు ఏవిధంగా కూడా సరిపోవట్లేదు. కాబట్టి ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఏదో ఒక ఊర్లో జరుగుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: