జర్మనీలో కాల్పుల నింధితుడు తల్లితో సహ మృతి!

Edari Rama Krishna

జర్మనీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు.  నిన్న రాత్రి 10 గంటలు దాటిన తర్వాత హనావ్ నగరంలో గుర్తు తెలియని సాయుధులు కాల్పులకు తెగబడ్డారు.  నగరం మధ్యలో ఉన్న హుక్కా సెంటర్ వద్ద తొలుత కాల్పులు జరిపిన దుండగులు ఆ తర్వాత మరో ప్రాంతానికి చేరుకుని కాల్పులు జరిపారు. తొలుత జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, రెండోసారి జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. లుత జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, రెండోసారి జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం దుండగులు పరారయ్యారు.

 

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం  గాలింపు మొదలు పెట్టారు.  అయితే  విచ్చలవిడిగా కాల్పులు జరిపి 9 మందిన పొట్టనబెట్టుకున్న దుండగుడు తన అపార్ట్ మెంట్ లోనే విగతజీవిలా కనిపించాడు. కాగా ఉదయం నుంచి స్మోకింగ్ బార్లపై కాల్పులు జరిపిన టోబీ ఆర్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు జరిపారు. ఈ నేపథ్యంలో, ఓ అపార్ట్ మెంట్ లో రెండు మృతదేహాలను గుర్తించారు. వాటిలో ఒకటి టోబీ ఆర్ ది కాగా, మరొకటి అతని తల్లిదని భావిస్తున్నారు.  అయితే ఆ లేఖలో జర్మనీ లో నివసిస్తున్న కొంత మందిని నిర్మూలించాల్సిన అవసరం ఉంది.. అందుకే వారిని సమూలంగా కాల్చి వేశాను లేఖలో పేర్కొన్నాడు. 

 

అయితే చనిపోయిన టోబీ ఆర్అ తివాద భావజాలంతో ఉన్న వ్యక్తి అని కొంత మంది అతన్ని ఉన్మాది అయ్యేలా ప్రేరేపించారని అతను  జర్మనీలో ఉంటున్న టర్కిష్, కుర్దిష్ శరణార్థులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఏది ఏమైనా మొదట ఇది ఉగ్రవాద చర్యగా భావించినప్పటికీ ఓ అతివాది తీసుకున్న కృరమైన నిర్ణయానికి తొమ్మిది మంది బలి అయ్యారని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: