బిగ్ బ్రేకింగ్ : ఉత్తమ్ కు ఆ ఒక్కటీ పాయే... నేరేడుచర్ల మున్సిపాలిటీ టిఆర్ఎస్ ఖాతాలోకే ?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని స్థానాలు రిజల్ట్ పెండింగ్ పడడంతో వాటి పై ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ తమ ఖాతలో పడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా ఆశలు పెట్టుకోగా  మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పై ఉత్కంఠ నెలకొంది. మొత్తం ఈ  మున్సిపాలిటీలో 15 వార్డుల్లో టిఆర్ఎస్ 07 , కాంగ్రెస్ 07  ఒక్క సీటు సీపీఎం  గెలుచుకున్నారు. కాంగ్రెస్ కూటమికి ఈ మున్సిపాలిటీ దక్కిందని దాదాపు ఇక్కడ విజయం ఖాయం అయిందని అంతా భావిస్తున్న సమయంలో తెరపైకి ఎక్స్ అఫీషియో ఓట్లు వచ్చాయి. దీంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిన్న ఉదయం నుంచి వాయిదా పడుతూ వస్తోంది.


 మరికొద్ది సేపట్లో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతున్న నేపధ్యంలో టిఆర్ఎస్ పార్టీ వేగంగా పావులు కదుపుతూ మున్సిపాలిటీని హస్తగతం చేసుకునేలా వ్యూహాలు పన్నింది. దీనిలో భాగంగా నేరేడుచర్ల లో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కాంగ్రెస్ తీసుకురావడంతో కాంగ్రెస్ గెలుపు దాదాపు ఖాయమైంది అని అంతా భావించారు.అలాగే టిఆర్ఎస్  ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కూడా ఎక్స్ అఫిషియో సభ్యుడు కావడంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆసక్తిగా మారింది. సుభాష్ రెడ్డి కి ఓటు హక్కు కల్పించాలంటూ ఎన్నికల సంఘానికి టిఆర్ఎస్ లేఖ కూడా రాసింది.


 దీంతో కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి అయిన తర్వాత ఓటు హక్కు ఎలా కల్పిస్తారు అంటూ  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇద్దరు కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేశారని గుర్తు చేశారు. దీనిపై ఆయన లేఖ కూడా రాశారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడు కెవిపి ఓటు అమలు కాకపోవడంపై సీరియస్ గా కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. ప్రస్తుతం  మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి పేరును అధికారులు నమోదు చేయడంతో 15 వార్డులు ఉన్న నేరేడుచర్ల మున్సిపాలిటీలో దాదాపు టిఆర్ఎస్ పార్టీ విజయం ఎక్కడ దాదాపుగా ఖరారైంది. 


ఈ నేపథ్యంలో నేరేడుచర్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో 144 సెక్షన్ విధించారు. ముందస్తుగా దుకాణాలు బంద్ చేయించారు. అయితే దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో కేటీఆర్ అక్రమాలు పెరిగిపోయాయని, కేటీఆర్ ఎన్నికల అక్రమాలకు నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికలే నిదర్శనం అని ఆయన విమర్శించారు. 25వ తేదీ వరకు సభ్యుల నమోదు జరగాలని అన్నారు. కానీ ఈరోజు నేరేడుచర్ల మున్సిపల్ సభ్యులుగా సుభాష్ రెడ్డి పేరును ఇప్పుడు నమోదు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: