ప్రలోభాలకు తెర లేపిన అభ్యర్థులు ...

B Sridhar Yadav

మున్సిపోల్స్ ప్రచారం ముగిసింది . ఇక ప్రలోభాలకు తెర లేచింది . ఇప్పటి వరకు ప్రచారం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని చూసిన అభ్యర్థులు , ఇప్పుడు ఓటర్లను మద్యం , నగదు ఇచ్చి మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు . ఒకొక్క మున్సిపాలిటీ పరిధి లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థుల వివిధ రకాల జిమ్మిక్కులు చేస్తున్నారు . ఇప్పటికే సంక్రాతి పండుగ సందర్బంగా ఇంటికి కిలో మాంసం , ఒక ఖరీదైన మద్యం బాటిల్ అందజేసిన అభ్యర్థులు , నిన్న ఆదివారం ఇంటికొక కిలో చికెన్ ప్యాకెట్ , మద్యం బాటిల్ సరఫరా చేసి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు .

 

ఇక ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే చాలు లక్ష రూపాయలు ఇచ్చేందుకు   కూడా అభ్యర్థులు రెడీ అయ్యారన్న వార్తలు విన్పిస్తున్నాయి .   ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని ఏడు మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియడంతోనే అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ రకాల ఎత్తులు వేస్తున్నారు . నల్గొండ , సూర్యాపేట , హుజూర్ నగర్ , నేరేడుచర్ల , మిర్యాలగూడ , భువనగిరి , చండూరు , చౌటుప్పల్ మున్సిపాలిటీల పరిధిలో అధికార టీఆరెస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది . జిల్లా లో తిరిగి పట్టు నిలబెట్టుకునేందుకు  కాంగ్రెస్ పార్టీ నేతలు , ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో  విజయం సాధించాలని  కృత నిశ్చయం తో ఉన్నారు .

 

ఇక జిల్లాలో ఏ ఒక్క మున్సిపాలిటీ ని కూడా జారవిడుచుకోవద్దని అధికార టీఆరెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది . నూతన మున్సిపాలిటీలే కాకుండా , ఇప్పటికే మున్సిపాలిటీలుగా కొనసాగుతోన్న పురపాలికల అభివృద్ధి కోసం టీఆరెస్ ను  గెలిపించాలని మంత్రులు , టీఆరెస్ ప్రజాప్రతినిధులు విస్తృత ప్రచారం నిర్వహించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: